మీ రోజువారీ జీవితాన్ని AI ఎలా కంట్రోల్ చేస్తోందో తెలుసుకోండి.!

HIGHLIGHTS

మీకు తెలియకుండా మీ రోజువారీ జీవితాన్ని AI ఎలా కంట్రోల్ చేస్తోందో మీకు తెలుసా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్థాయిలో రోజువారీ జీవితాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో అందరికీ అర్థం కాని విషయం

ఇది మనకు తెలియకుండా మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది

మీ రోజువారీ జీవితాన్ని AI ఎలా కంట్రోల్ చేస్తోందో తెలుసుకోండి.!

మీకు తెలియకుండా మీ రోజువారీ జీవితాన్ని AI ఎలా కంట్రోల్ చేస్తోందో మీకు తెలుసా? ఈ ప్రశ్న అడిగితే ఎక్కువ మంది తెలియదు అనే సమాధానమే చెబుతారు. ఎందుకంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్థాయిలో మన రోజువారీ జీవితాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో అందరికీ అర్థం కాని విషయం గా ఉంటుంది. అయితే, మీ రోజువారీ జీవితాన్ని ఏఐ ఎలా నియంత్రిస్తుందని తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు చేద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రోజువారీ జీవితాన్ని AI ఎలా కంట్రోల్ చేస్తుందా?

ఈరోజుల్లో మనం ఫోన్, యాప్‌ లు, సోషల్ మీడియా వాడుతున్న ప్రతిసారి ఒక “అదృశ్య శక్తి” మనకు తెలియకుండా మనతో పాటు పనిచేస్తుంది. అదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఇది మనకు తెలియకుండా మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, కొన్ని సందర్భాల్లో మన నిర్ణయాలు పూర్తిగా నియంత్రిస్తోంది కూడా.

AI Control

AI ఎలా పని చేస్తుంది?

ఏఐ అనేది మీ సెర్చ్ హిస్టరీ, వీడియోలు చూసే విధానం, కొనుగోలు అలవాట్లు మరియు లొకేషన్ డేటా వంటి వాటిని విశ్లేషించి మీకు నచ్చిన లేదా నచ్చే విషయాలను ముందుగానే చూపిస్తుంది. దీనిని రికమండేషన్ సిస్టమ్ అంటారు. ఇది బేసిక్ అండ్ స్టాండింగ్ వర్క్ గా చూడవచ్చు.

సోషల్ మీడియా : ప్రభావితం

మీరు సోషల్ మీడియా లేదా యూట్యూబ్ మరియు Instagram వంటివి ఓపెన్ చేస్తే మీరు ఎక్కువగా ఏ వీడియోలు చూస్తున్నారు మరియు ఎటువంటి పోస్టులు లైక్ చేస్తున్నారు అని ఏఐ లెక్క కడుతుంది. దానికి అనుగుణంగా అదే రకమైన కంటెంట్‌ను మళ్లీ మళ్లీ చూపిస్తుంది. ఇది మిమ్మల్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. అంటే, మీరు ఒకే రకమైన కంటెంట్ లో మునిగిపోయేలా చేస్తుంది.

దీని వలన మీ ఆలోచనలు ఒకే దిశలోకి వెళ్లిపోతాయి. అంతేకాదు, మీరు కొత్త విషయాలు చూడటం తగ్గుతుంది మరియు కొత్త విషయాలపై ఆసక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీనిని “Filter Bubble” అంటారు. ఈ కారణంగా ఏఐ వల్ల మన ప్రపంచ దృష్టి తగ్గిపోవచ్చు.

ఆన్లైన్ లో మీరు కొనేది మీ నిర్ణయమా?

Amazon మరియు Flipkart వంటి ఈ కార్ట్ సైట్స్ లేదా ఆన్లైన్ యాప్స్ లో మీరు కొనేది మీ నిర్ణయమా, అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే, మీరు చూసిన ప్రొడక్ట్స్ మరియు మీ సెర్చ్ హిస్టరీ ఆధారంగా ఆ సైట్ మీకు రికమండేషన్స్ చూపిస్తాయి. ఒక రీసెర్చ్ ప్రకారం, సుమారు 55% మంది AI వాళ్ళ నిర్ణయాలపై ప్రభావం ఉందని చెప్పారు. అంటే, ఆన్లైన్ లో మీరు కొనుగోలు చేసే వస్తువుల పైన కూడా ఏఐ ప్రభావం ఉంటుంది.

AI Control

మీరు ఎక్కడికి వెళ్లాలో కూడా ఏఐ నిర్ణయిస్తుందా?

గూగుల్ మప్స్ అండ్ నావిగేషన్ లో మీరు ఎక్కడికి వెళ్లాలో కూడా ఏఐ నిర్ణయిస్తుంది. ఎందుకంటే, ట్రాఫిక్ మరియు రోడ్డు పరిస్థితి లెక్కించిన ఏఐ మీకు బెస్ట్ రూట్ చూపిస్తుంది. వాస్తవానికి, చాలా మంది కూడా అదే రూట్‌ను ఫాలో అవుతారే తప్ప స్వయంగా ఆలోచించి ఇతర మార్గాలు ఎంచుకోరు.

OTT ప్లాట్ ఫామ్స్ లో మీరు ఏమి చూడాలో AI నిర్ణయిస్తుంది

నెట్ ఫ్లిక్స్, అమెజాన్, జియో స్టార్ మొదలుకొని యూట్యూబ్ వరకు మీ వ్యూవింగ్ హిస్టరీ ఆధారంగా ఏఐ సినిమాలు మరియు వీడియోలు సూచిస్తాయి. ఇందులో చాలా సందర్భాల్లో మీరు చూసే కంటెంట్‌ లో అధిక భాగం ఏఐ సిఫార్సు ఉంటుంది.

Also Read: Realme NARZO 100 Lite 5G: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

జాబ్స్ లో ఏఐ ప్రభావం

ఒకప్పుడు జాబ్ కోసం అప్లై చేస్తే కనీసం ఇంటర్వ్యూ వరకు అవకాశం ఉండేది మరియు అక్కడ మన టాలెంట్ ను నిరూపించుకునే ఛాన్స్ ఉండేది. అయితే, కొత్తగా వచ్చిన ‘Resume screening’ వంటి వాటి ద్వారా 100% రిచ్ కాకుంటే మీ అప్లికేషన్ ను ఏఐ ముందే రిజక్ట్ చేస్తుంది. మీ అప్లికేషన్ ను HR చూసే అవకాశమే ఉండకపోవచ్చు. అంటే, మీ career పై కూడా AI ప్రభావం ఉంది.

AI Control Jobs

ఏఐ కంట్రోల్ : కనిపించని రిస్క్

ఏఐ పాత డేటా ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి నిర్ణయంలో తప్పిదాలు దొర్లే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా, ట్రాన్స్పరెన్సీ లోపం ప్రధానమైనది. ఏఐ నిర్ణయం తీసుకోవడానికి తగిన కారణాలు లేదా అంశాలు కూడా మనకు తెలియదు. ఏఐ మీ విలువైన సమయాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఎలాగంటే, సోషల్ మీడియాలో ఎక్కువగా స్క్రోల్ చేయించేలా
డిజైన్ చేస్తుంది.

నిజంగా ఏఐ మనల్ని కంట్రోల్ చేస్తుందా?

నిజంగా ఏఐ మనల్ని కంట్రోల్ చేస్తుందా? అని సూటిగా అడిగితే, ఇది మనల్ని డైరెక్ట్ గా కంట్రోల్ చేయలేదు. కానీ మన నిర్ణయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రెగ్యులర్ ఈ నిర్ణయాలను గుడ్డిగా ఫాలో అయ్యారంటే అది కంట్రోల్ గా మారుతుంది.

మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

  • ఏఐ రికమండేషన్స్ ను గుడ్డిగా ఫాలో చేయకూడదు.
  • ఇతర ఆప్షన్స్ మరియు ఆల్టర్నేటివ్ చూడండి
  • మీ డివైజ్ లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉపయోగించండి
  • డిజిటల్ అవేర్నెస్ ఇంకా పెంచుకోండి

ముగింపు :

AI మన జీవితాన్ని చాలా సులభం చేస్తుంది. కానీ అదే సమయంలో మన నిర్ణయాలను సబ్ టైటిల్ గా మారుస్తోంది. కాబట్టి, మీరు వీలైనంత సొంత నిర్ణయాలు తీసుకునే అలవాటు చేసుకోండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo