మీరు ఆండ్రాయిడ్ మొబైల్ లో అన్నీ customise చేస్తూ ఉంటారా? అయితే ఈ లాంచర్ మీకు బాగా నచ్చుతుంది.

HIGHLIGHTS

ప్లే స్టోర్ లో ఉన్న అన్ని లాంచర్స్ కు ఇది భిన్నంగా బాగుంటుంది

మీరు ఆండ్రాయిడ్ మొబైల్ లో అన్నీ customise చేస్తూ ఉంటారా? అయితే ఈ లాంచర్ మీకు బాగా నచ్చుతుంది.

మన దగ్గర వర్కింగ్ ఫోన్ ఉన్నా, మరొక ఫోన్ కొనాలనే ఆలోచనకు కారణాలలో ఒకటి – బోర్ కొట్టడం. ఆండ్రాయిడ్ ఫోనుల్లో బోర్ అనేది ఉండదు 95%. కారణం దీనిలో ఉండే Customizations. ఆండ్రాయిడ్ పవర్ యూసర్ కు రోజూ ఏదో ఒకటి తెలుసుకోవటం, కొత్త సెట్టింగ్స్ ను యాక్సిస్ చేయటం అలవాటు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

కాని సాధారణ యూసర్ కు బోర్ కొట్టకుండా ఉండాలి అంటే సింపుల్ గా కొత్త లాంచర్ ను ఇంస్టాల్ చేసుకోవటమే. టోటల్ హోమ్ స్క్రీన్ అంతా మార్చివేస్తాయి ఇవి. అదనపు స్మార్ట్ సెట్టింగ్స్ కూడా ఇస్తాయి. సో బోర్ కొట్టిందని కొత్త ఫోన్ కు డబ్బులు ఖర్చు పెట్టె బదులు సింపుల్ గా కొత్త లాంచర్స్ ఇంస్టాల్ చేసుకుంటే సరిపోతుంది కదా! 🙂

ఆండ్రాయిడ్ లో ఎప్పటి నుండో ఒక లాంచర్ ఉంది. కాని దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇది మిగిలిన లాంచర్స్ కు చాలా భిన్నంగా ఉంటుంది. డిఫరెంట్ లుక్స్ అండ్ ఆప్షన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. దీని పేరు, TSF Launcher. ఈ లింక్ లో ప్లే స్టోర్ లో 4.4 స్టార్ రేటింగ్ తో ఉంది. సైజ్ 10MB. లేటెస్ట్ గా ఆగస్ట్ 31న కొత్త అప్ డేట్ కూడా ఇచ్చింది.

ఇక ఫీచర్స్…

1. మీరు ఇంతవరకూ చూసిన లాంచర్స్ కన్నా భిన్నంగా ఉంటుంది అన్ని విషయాలలో.

2. 3D అవటం వలన యానిమేషన్స్ ఎక్కువుగా ఉంటాయి. కాని ఎక్కడ లాగ్స్ ఉండవు. మినిమమ్ 1gb ర్యామ్ ఉన్న ఫోన్ లో కూడా ఫాస్ట్ గా పనిచేస్తుంది. 3D యానిమేషన్ ఓవర్ గా ఉండవు. బాగుంటాయి.

3. ఐకాన్స్, ఫోల్డర్స్, docks సైజెస్ అండ్ etc అన్నీ మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు.

4. ఎన్ని యాప్స్ ఉన్న అన్నీ ఒకేసారి సింపుల్ గీత తో డిలిట్, ఫోల్డర్ యాడింగ్ etc వంటివి చేయగలరు.

5. Gestures కూడా చాలా ఉంటాయి. స్టేటస్ bar hiding, లాంచర్ సైడ్ బార్ వంటివి ఉన్నాయి.

6. మెసేజ్, వెధర్, మ్యూజిక్ వంటి TSF widgets 10 వరకూ ఉన్నాయి. థీమింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఐకాన్స్ అన్నీ మార్చుకోగలరు.

ఓవర్ ఆల్ గా ఫీచర్స్ వైస్ గా మీకు కొత్తవేమీ లేవు కదా అనిపిస్తుంది కాని ఒకసారి లాంచర్ ను వాడటం స్టార్ట్ చేశాక దాని ఎక్స్పీరియన్స్ మాత్రం కొత్తగా ఉంటుంది. ఇది కొంతకాలం క్రింత వరకూ paid యాప్. ఇప్పుడు ఫ్రీ గా ఉంది. లాంచర్ లింక్ పైన ఇవటం జరిగింది. చూడగలరు.

మీకు ఒక మంచి టైమ్ పాస్ అండ్ useful లాంచర్ ను తెలియజేశాను అనే అనుకుంటున్నాను. కాని ఇలాంటి వాటి పై మరీ ఎక్కువ టైమ్ ను కేటాయించి అనవసరం గా పనులను వాయిదా వేసి టైమ్ వెస్ట్ చేసుకోకండి. కేవలం ఒక 4 – 5 ఇంచేల స్క్రీన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది అని గుర్తుకుతెచ్చుకొండి. ఆలోచించడి. ఆ స్క్రీన్ నుండి బయటకు రండి. Be Productive.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo