చౌక ధరలో మంచి ఫీచర్లతో రానున్న JIOPHONE 3 : ధర స్పెక్స్ మరియు మరిన్ని విశేషాలు

జియో సంస్థ, టెలికం రంగంలోకి ఎంట్రీ ఇస్తూనే తన ఆఫర్లు మరియు నెట్వర్కుతో అందరిని షాక్ కు గురిచేసిన విషయం అందరికి తెలిసిందే. అంతటితో ఆగకుండా తన జియో ఫోన్ విడుదల చేసి చాల తక్కువ ధరలో 4G అందరికి అందుబాటులోకి తీసుకువచ్చి తన సత్తా చాటుకుంది. ఆ తరువాత, QWERTY కీబోర్డుతో ఒక ఫీచరు ఫోన్ను అతితక్కువ ధరతో తీసుకొచ్చి మరొకసారి తనకు ఎవరు సాటిరారని తెలియచేసింది. ప్రస్తుతం, అతిత్వరలోనే ఒక పెద్ద టచ్చ్ స్క్రీన్ తో కూడిన ఒక ఫోన్ను, జియోఫోన్ 3 గా మార్కెట్లోకి తీసుకురాబోతున్నదని తెలుస్తోంది.

జియో ఫోన్3 స్పెసిఫికేషన్స్ (రూమర్లలో ఉన్న స్పెక్స్)

కొన్ని నివేదికలలో తెలిపిన ప్రకారం, ఈ సంస్థ జియో ఫోన్ను ఒక 5- అంగుళాల టచ్చ్ స్క్రీన్ డిస్ప్లేతో ప్రకటించనున్నదని తెలుస్తోంది. ఈ హ్యాండ్సెట్ ఒక 2GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజితో రానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చెప్పినదంతా నిజంగా జరిగితే, ముందుగా వచ్చిన 2.4 ఇంచ్ స్క్రీన్ మరియు 4GB స్టోరేజి నుండి ఒక్కసరిగా గణనీయమైన మార్పుకు జియో నాంది పలకనునట్లు చెప్పుకోవచ్చు. అలాగే, ముందుగా వచ్చిన జియో ఫోన్ల వలెనే మెమోరిని పెంచుకునేవేలును కూడా కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక కెమేరాల పరంగా కూడా ఇది బాగానే ఉండవచ్చని అర్ధమవుతుంది. ఇది ఒక 5MP వెనుక కెమెరా మరియు ముందు 2MP సెల్ఫీ కెమేరాతో తో ఉండవచ్చు. అయితే, దీని OS గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ, KaiOS పూర్తి ప్రధాన వెర్షన్ లేదా గూగుల్ యొక్క తేలిక పాటి వెర్షన్ అయినటువంటి Android Go OS ఉండవచ్చని అంచనావేస్తున్నారు.

జియోఫోన్ 3 అంచనా ధర మరియు అందుబాటు

ఈ నివేదిక ప్రకారం, ఒకవేళ ఈ జియోఫోన్ పైన తెలిపిన అప్డేట్స్ తో కనుక వచ్చినట్లయితే, ఇది 1500 మరియు 2999 ధరలతో వరుసగా విడుదలైనటువంటి జియోఫోన్ మరియు జియోఫోన్2 కంటే ఎక్కువ ధరతో ఉండవచ్చు. ఈ జియోఫోన్ 3 రూ.4,500 ధరతో ఉండవచ్చని అంచనా మరియు ముందు ఫోన్ల మాదిరిగానే ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది.

ఇక లాంచ్ డేట్ విషయానికి వస్తే, ఈ జియోఫోన్3 అతిత్వరలోనే ప్రీ ఆర్డర్ల కోసం రావచ్చని, వీటి యొక్క సేల్ కూడా వెనువెంటనే  ప్రారంభంకావచ్చని అంచనాలను వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :