మీ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ కావడం వలన మీకు ఇబ్బంది తలెత్తితే ఏమి చేస్తారు

HIGHLIGHTS

అత్యవసర సమయంలో మీ స్మార్ట్ ఫోన్ పనిచెయ్యడం మానేస్తే.

మీ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ కావడం వలన మీకు ఇబ్బంది తలెత్తితే

మీ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ కావడం వలన మీకు ఇబ్బంది తలెత్తితే ఏమి చేస్తారు

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో లేకుండా నిముషం కూడా గడవదు. స్మార్ట్ ఫోన్ అంతగా మన జీవితంలో ఒక భాగంగా మరిపాయింది. మన ఆఫీస్ పనులను చేయడానికి, ఆన్లైన్ లో అందరికి టచ్ లో ఉడడంతో పాటుగా ఒక కెమెరాలా కూడా ఉపయోగపడుతుంది. అందుకే, స్మార్ట్ ఫోన్ అంతగా అందరిని ప్రభావితం చేసింది.

అయితే, అత్యవసర సమయంలో మీ స్మార్ట్ ఫోన్ పనిచెయ్యడం మానేస్తే. అంటే, మీ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ కావడం వలన మీకు ఇబ్బంది తలెత్తితే ఏమి చేస్తారు. మీ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవడానికి గల కారణాలు మరియు వాటిని ఎలా నివారించాలో తెలుసుకుంటే మంచిది.                         

ఉపయోగం లేని APPs కారణంకావచ్చు

మా ఫోను‌లో మీరు రోజు చాలా యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటారు, కానీ కొన్ని యాప్స్ మాత్రమే మ్రు ఉయోగిస్తారు మరికొన్ని చాలా అరుదుగా ఉపయోగించబడతాయి. అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఉపయోగం లేని చాలా యాప్స్ మీ స్మార్ట్ ఫోనులో స్టోర్ చేయబడతాయి. ఒక స్మార్ట్ ‌ఫోన్ ఎక్కువగా హ్యాంగ్ అవ్వడానికి ఇదే పెద్ద కారణం. ఈ యాప్స్, ఫోన్ పనితీరును మరియు RAM పనిని తినేస్తాయి.

అంతేకాదు,  ఈ యాప్స్ తెలియకుండానే ఆటొమ్యాటిగ్గా అప్డేట్ అవుతుంటాయి. ఫలితంగా, ఫోన్ స్టోరేజి కూడా నిండిపోతుంది మరియు ఫోన్ హ్యాంగింగ్ సమస్య మరింత అధికమవుతుంది. కాబట్టి, మీకు ఉపయోగం లేని APPs ని మీ ఫోన్ నుండి డిలీట్ చెయ్యడం మంచింది.   

ఫోన్ అప్డేట్

ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి మరొక కారణం మీ ఫోన్ అప్డేట్ గా లేకపోవడం. స్మార్ట్ ‌ఫోన్లు ‌ఎల్లప్పుడూ కూడా అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ను ఉపయోగించాలి. మీ ఫోన్ ‌లో ఏదైనా క్రొత్త అప్డేట్స్ ఉన్నాయా అని చూడటానికి ఫోన్ సెట్టింగ్స్ ఎంపికకు వెళ్లండి. ఫోన్ అప్‌ డేట్ అయితే హ్యాంగ్ సమస్య కూడా చాలా వరకూ తగ్గిపోతుంది.

ఫోన్ స్టోరేజ్

స్మార్ట్ ఫోన్ ను అన్ని అవసరాలకు వాడుతుంటాము కాబాట్టి, ఏదో ఒక సమయంలో మీ ఫోన్‌లో స్టోరేజ్ నిండుకునట్లు కనిపిస్తుంది. ఇలా జరిగితే,  Android ఫోన్ హ్యాంగ్ లేదా నెమ్మదించే సమస్యను ఎదుర్కొంటాము. కాబట్టి, ఫోన్ స్టోరేజిని ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలి. మీ ఫోన్‌లో ఉపయోగించని వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇది ఫోన్ హ్యాంగింగ్ సమస్యను తొలగిస్తుంది    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :