ఇటీవల కాలంలో గ్యాస్ రేటు మరింతగా పెరిగి పోయింది. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ధర పెంపుతో గ్యాస్ సిలిండర్ ధర తారాస్థాయికి చేరుకుంది. అయితే, ప్రస్తుతం మీరు చేసే గ్యాస్ బుకింగ్ పైన మంచి లాభాన్ని అందుకునే అవకాశాన్ని Paytm మీకు అందిస్తోంది. ఇందులో మీరు చేయాల్సిందల్లా Paytm ద్వారా గ్యాస్ బుక్ చేయడమే. Paytm ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే LPG కస్టమర్లకు 500 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తోంది Paytm సంస్థ.
ఆన్లైన్ చెల్లింపు సంస్థ అయిన Paytm ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే వారికీ ఈ అఫర్ ఇస్తోంది. అయితే, Paytm ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే Indane Gas మరియు Bharat Gas వినియోగదారుల LPG Gas బుకింగ్ పైన మాత్రమే ఈ 500 రూపాయల క్యాష్ బ్యాక్ అఫర్ లభిస్తుంది. అయితే, ఈ క్యాష్ బ్యాక్ అఫర్ ను మీరు పొందాలంటే కొన్ని స్టెప్స్ అనుసరించాలి మరియు Paytm కొన్ని నిబంధనలను కూడా విధించింది. అవేమిటో పరిశీలిద్దాం…
Paytm నుండి క్యాష్ బ్యాక్ అఫర్ తో గ్యాస్ బుకింగ్
Paytm యొక్క ఈ LPG Gas బుకింగ్ క్యాష్ అఫర్ ను పొందాలంటే ముందుగా మీ వద్ద Paytm యాప్ ఉండాలి
మీ ఫోనులోని Paytm యాప్ లో రీఛార్జ్ & బిల్ పే అప్షన్ కు వెళ్ళాలి
ఇక్కడ మీరు LPG Cylinder Booking ఎంపికను చూడవచ్చు
ఇందులో మీరు LPG Gas Book పైన నొక్కిన వెంటనే మీకు కావాల్సిన గ్యాస్ కనెక్షన్ ఎంచుకోవాలి
ఇక్కడ HP, Indane మరియు Bharat గ్యాస్ నుండి మీ అప్షన్ ఎంచుకోవచ్చు
మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకున్న తరువాత, మీ రిజిస్టర్ మొబైల్ లేదా LPG ID ని నమోదు చెయ్యాలి
ఇక్కడ మీ గ్యాస్ ఏజన్సీ, LPG కన్జ్యూమర్ నంబర్ మరియు మీ గ్యాస్ యొక్క ఇతర సమాచారాన్ని చూడవచు
చివరిగా, మీ గ్యాస్ బుకింగ్ కోసం యెంత డబ్బును చెల్లించాలో ఇక్కడ చూడవచ్చు
అయితే, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ అఫర్ డిసెంబర్ 31 వరకూ మాత్రమే చెల్లుతుంది.
బుకింగ్ పైన Paytm విధించిన షరతులు
Paytm పైన LPG Gas బుకింగ్ పైన క్యాష్ బ్యాక్ అఫర్ పైన విధించిన షరతులను ఈ క్రింద చూడవచ్చు.
Paytm ద్వారా మొదటి సారి LPG Gas బుకింగ్ చేసుకునే LPG కస్టమర్లకు మాత్రమే ఈ అఫర్ వర్తిస్తుంది.
అఫర్ కోసం Promo Code విభాగంలో FIRST LPG కోడ్ ఎంటర్ చెయ్యాలి.
ఈ అఫర్ కేవలం Promo Code ఎంటర్ చేసిన వారికీ మాత్రమే ఇవ్వబడుతుంది
ఒకవేళ మీరు Promo Code ఎంటర్ చేయక పొతే మీకు అఫర్ వర్తించదు
ఈ అఫర్ కేవలం ఒక్కసారి వర్తిస్తుంది, మొదటిసారి బుకింగ్ పైన మాత్రమే.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.