Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోండి

HIGHLIGHTS

కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన కొన్నిబెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాను.

ప్రస్తుతం మార్కెట్లో అన్ని మొబైల్ తయారీ సంస్థలు కూడా బడ్జెట్ సెగ్మెంట్లో, అనేక అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. చెప్పాలంటే, వీటిలో షావోమి పేరు టాప్ ప్లేస్ లో నిలుస్తుంది మరియు ప్రస్తుతం శామ్సంగ్ కూడా షావోమితో పోటీ పడటానికి మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్లను విడుదలచేసింది. అందుకోసమే,  కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన  కొన్నిబెస్ట్  స్మార్ట్ ఫోన్లను  ఇక్కడ అందిస్తున్నాను.

1. రెడ్మి Y3

షావోమి సంస్థ నుండి కేవలం రూ.9,999 ధరలో 32MP సెల్ఫీ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్, 1.8 GHz వద్ద క్లాక్ చేయబడిన,  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 12+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ప్రారంభ ధరతో లభిస్తుంది

2. రెడ్మి నోట్ 7

ఇటీవల భారతదేశంలో మంచి స్పెక్స్ తో, 10,000 రూపాయల కంటే తక్కువధరలో షావోమి నుండి వచ్చినటువంటి స్మార్ట్  ఫోనుగా, ఈ రెడ్మి నోట్ 7 గురించి చెప్పొచ్చు. ఇది ముందు మరియు వెనుకా కూడా ఒక గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది మరియు ఒక 2.2GHz వద్ద క్లాక్ చెయ్యబడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. అలాగే, ఇందులో 12MP +2MP AI డ్యూయల్ కెమేరా, 13MP గొప్ప సెల్ఫీ కెమెరా మరియు 4000mAh వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఓపెన్ సేల్ తో అందుబాటులో వుంది.

3.  శామ్సంగ్ గెలాక్సీ M 20

శామ్సంగ్ తన M సిరీస్ ద్వారా గొప్ప స్పెక్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లను కేవలం బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది.  సరికొత్తగా వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ M 20 స్మార్ట్ ఫోన్,  13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.3 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  5000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

4. శామ్సంగ్ గెలాక్సీ M 10

శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

5.  అసూస్ జెన్ ఫోన్ మాక్స్ M2

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 OS తో పనిచేస్తుంది మరియు వెనుక భాగంలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 632(14nm)ప్రోసెసరుకి జతగా అడ్రినో 506 గ్రాఫిక్స్ మరియు 3GB ర్యామ్ తో శక్తివంతంగా ఉంటుంది. ఇది వెనుక 13+5MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 8MP సెన్సారును కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :