Coolpad Note 8 మీడియా టెక్ 6750T SoC, 5.99- అంగుళాల డిస్ప్లే మరియు 4000mAh బ్యాటరీ కలిగి, ఇండియాలో Rs. 9,999 ధరతో విడుదలైంది

HIGHLIGHTS

ఈ కూల్ ప్యాడ్ నోట్ 8 యొక్క 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి బ్లాక్ పియానో కలర్ వేరియంట్ ఇపుడు పేటిఎమ్ మాల్ లో అందుబాటులోవుంది.

Coolpad 5A, బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదల చేసిన రెండు నెలల తారువాత, ఈ Coolpad Note 8 ని ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇపుడు,  Rs. 9,999 ధరతో బ్లాక్ పియానో రంగు వేరియంట్ పేటిఎమ్ మాల్ లో అందుబాటులోవుంది. ఈ ఫోన్ ఒక 4000mAh బ్యాటరీ, పేస్ అన్లాక్, మరియు రియర్ డ్యూయల్ కెమేరా శెట్పతో వస్తుంది. ఈ కూల్ ప్యాడ్ నోట్ 8 ఫోన్ ఈ సంవత్సరం మే నెలలో వచ్చిన,  కూల్ ప్యాడ్ నోట్ 6 కి తరువాతి నోట్ ఫోనుగా ఉంటుంది.       

Coolpad Note 8 ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్ 18:9 యాస్పెక్ట్ రేషియోతో 1080 x 2160 పిక్సెళ్ళు అందించగల ఒక 5.99 అంగుళాల Full -HD+ డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోన్ 1.5GHz వద్ద క్లాక్ చేయబడిన  క్వాడ్ – కోర్  మీడియా టెక్ 6750T SoC శక్తితో ఉంటుంది. ఈ ప్రాసెసర్ మాలీ T860-MP2 GPU తో జతచేయబడి ఉంటుంది  మరియు 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజి, ఇంకా దీనిని మైక్రో SD కార్డుతో 128GB వరకు విస్తరించవచ్చు. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరెయో 8.0 తో నడుస్తుంది మరియు కస్టమ్ క్విక్ లంచ్ కోసం ఇది టచ్ కంట్రోల్ ఆదేశాలకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

కెమేరా విభానికి వస్తే, ఈ కూల్ ప్యాడ్ నోట్ 8 నిలుగా అమర్చిన డ్యూయల్ కెమేరా సెట్పాతో వస్తుంది. ఇందులో f/2.0 ఆపేర్చేర్ మరియు ఆటో ఫోకస్ గల ఒక ప్రధాన 16 MP కెమేరా తో పాటుగా, 0.3MP కెమేరా జతగా ఉంటుంది. ఈ కెమేరాతో పాటుగా LED ఫ్లాష్ కూడా ఉంటుంది దాని పక్క వైపున మరియు కెమేరాకు దిగువ భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా అందించారు. ఏ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కేవలం 0.2 సెకేన్ల లోనే ఫోన్ని అన్లాక్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.  ముందు భాగంలో, f/2.2 ఆపేర్చేర్ గల ఒక 8MP కెమేరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది 200 స్టాండ్ బై మరియు 8 గంటల టాక్ టైం అందిస్తుందని కంపెనీ తెలిపింది.                             

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :