OnePlus Buds 4: ప్రీమియం ఫీచర్స్ మరియు యూనిక్ డిజైన్ తో లాంచ్ అయ్యింది.!
OnePlus Buds 4 ఇయర్ బడ్స్ ను ఈరోజు వన్ ప్లస్ లాంచ్ చేసింది
వన్ ప్లస్ నార్డ్ 5 మరియు నార్డ్ CE5 తో పాటు ఈ కొత్త బడ్స్ కూడా లాంచ్ చేసింది
ఈ బడ్స్ 55dB రియల్ టైమ్ అడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది
OnePlus Buds 4 ఇయర్ బడ్స్ ను ఈరోజు వన్ ప్లస్ లాంచ్ చేసింది. వన్ ప్లస్ నార్డ్ 5 మరియు వన్ ప్లస్ నార్డ్ CE5 స్మార్ట్ ఫోన్స్ తో పాటు ఈ కొత్త బడ్స్ కూడా లాంచ్ చేసింది. ఈ బడ్స్ ప్రీమియం ఫీచర్స్ మరియు యూనిక్ డిజైన్ తో లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈరోజే సరికొత్తగా విడుదల చేసిన ఈ కొత్త బడ్స్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyOnePlus Buds 4 : ప్రైస్
వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ ని రూ. 5,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ జెన్ గ్రీన్ మరియు స్టోర్మ్ గ్రే రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఇయర్ బడ్స్ పై రూ. 500 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఇది కాకుండా 6 నెలల No Cost EMI ఆఫర్ కూడా అందించింది. వన్ ప్లస్ నార్డ్ 5 ఫోన్ తో ఈ బడ్స్ కొనే వారికి రూ. 500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.
OnePlus Buds 4 : ఫీచర్స్
వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ 11mm ఉఫర్ మరియు 6mm ట్వీటర్ కలిగిన డ్యూయల్ డ్రైవర్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఈ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ 15Hz~40KHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కలిగి ఉంటుంది. ఇందులో మంచి కాలింగ్ కోసం ఒక్కొక్క బడ్ లో మూడు ఇయర్ ఫోన్స్ చొప్పున ఆరు ఇయర్ ఫోన్స్ కలిగి ఉంటుంది మరియు 3 మైక్ AI నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త బడ్స్ ను వన్ ప్లస్ ఇప్పటి వరకు అందించని యూనిక్ డిజైన్ తో అందించింది.

ఇక ఈ బడ్స్ కలిగిన ప్రీమియం ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ బడ్స్ Hi-Res ఆడియో మరియు LHDC 5.0 సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ బడ్స్ గొప్ప లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ 55dB రియల్ టైమ్ అడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది. ఇది బయట నుంచి వచ్చే శబ్దాలను చెవి లోపలికి చేరకుండా అడ్డుకొని క్లీన్ అండ్ క్లియర్ సౌండ్ అందిస్తుంది.
ఈ వన్ ప్లస్ లేటెస్ట్ బడ్స్ Bluetooth వెర్షన్ 5.4 సపోర్ట్ తో స్టడీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ గూగుల్ ఫాస్ట్ పెయిర్ మరియు డ్యూయల్ డివైజ్ కనెక్షన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ వన్ ప్లస్ బడ్స్ టోటల్ 45 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. అయితే, ANC ఆన్ లో ఉంటే మాత్రం 24 గంటల ప్లే టైమ్ మాత్రమే అందిస్తుంది. ఈ బడ్స్ ని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది.
Also Read: Ai+ Nova 5G : కేవలం రూ. 7,499 కే సూపర్ 5G ఫోన్ అందించిన భారతీయ కంపెనీ.!
ఈ బడ్స్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా అందించింది. ఇందులో, వన్ ప్లస్ 3D ఆడియో, సౌండ్ మాస్టర్ ఈక్వలైజర్, గోల్డెన్ సౌండ్, 47ms లో లెటెన్సీ, ట్రాన్స్ లేషన్, AI అసిస్టెంట్ షార్ట్ కట్, ఫైండ్ మై ఇయర్ బడ్స్, డబుల్ ట్యాప్ కెమెరా కంట్రోల్ మరియు IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.