Dolby Atmos సపోర్ట్ తో కొత్త Nirvana IVY Pro ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్.!

HIGHLIGHTS

boAt అప్ కమింగ్ బడ్స్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది

Nirvana IVY Pro ఇయర్ బడ్స్ ను Dolby Atmos సపోర్ట్ తో లాంచ్ చేస్తుంది

ఈ బడ్స్ 4 సార్లు మ్యూజిక్ లో గ్రామీ అవార్డు అందుకున్న LUCA ఆధ్వర్యంలో కో ట్యూన్ చేయబడింది

Dolby Atmos సపోర్ట్ తో కొత్త Nirvana IVY Pro ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్.!

ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ boAt అప్ కమింగ్ బడ్స్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. అదే, Nirvana IVY Pro ఇయర్ బడ్స్ మరియు ఈ బడ్స్ ను Dolby Atmos సపోర్ట్ తో పాటు మరిన్ని ఆకట్టుకునే ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇయర్ బడ్స్ ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ ద్వారా మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి బోట్ రెడీ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nirvana IVY Pro Dolby Atmos earbuds

బోట్ ఈ కొత్త నిర్వాణ ఐవీ ప్రో ఎఆర్ బడ్స్ ను జూలై 10వ తేదీ మధ్యాహ్నం లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఈ ఇయర్ బడ్స్ సేల్ కి అందుబాటులోకి వస్తాయి. అంటే, కొత్త బడ్స్ పై అమెజాన్ ప్రైమ్ డే డీల్స్ అందుకునే అవకాశం ఉంటుంది.

Nirvana IVY Pro : ఫీచర్స్

ఈ బోట్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ని ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు బోట్ కన్ఫర్మ్ చేసింది. ఈ బడ్స్ ను డాల్బీ అట్మోస్, గూగుల్ మరియు LDAC వంటి గ్లోబల్ టెక్నాలజీ పార్ట్నర్స్ తో జతగా ఈ బడ్స్ అందిస్తున్నట్లు బోట్ తెలిపింది. ఇక ఈ బడ్స్ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ లో 11mm ఉఫర్ మరియు 6mm ట్వీటర్ కలగలిపిన డ్యూయల్ డైనమిక్ డ్రైవర్ సెటప్ ఉంటుంది. ఈ బడ్స్ బోట్ సిగ్నేచర్ సౌండ్ మరియు 4 సార్లు మ్యూజిక్ లో గ్రామీ అవార్డు అందుకున్న LUCA ఆధ్వర్యంలో కో ట్యూన్ చేయబడింది.

Nirvana IVY Pro Dolby Atmos earbuds

ఇది మాత్రమే కాదు, ఈ బడ్స్ Dolby Atmos సపోర్ట్ Hi-Res Audio Wireless ఫీచర్ మరియు LDAC సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త బడ్స్ బోట్ హియరబుల్స్ యాప్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ప్రీమియం ఫీచర్స్ తో ఈ బడ్స్ యూజర్లకు గొప్ప ప్రీమియం సౌండ్ అనుభూతిని అందించే అవకాశం ఉంటుంది.

Also Read: OPPO Reno 14 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదలైన ఒప్పో కొత్త ఫోన్ సేల్.!

ఇక ఈ బోట్ కొత్త ఇయర్ బడ్స్ కలిగిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డాల్బీ అట్మోస్ హెడ్ ట్రాకింగ్ మరియు 52dB హైబ్రిడ్ అడాప్టివ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా ఈ బడ్స్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ కంప్లీట్ ఫీచర్ కలిగిన గొప్ప ప్యాకేజీగా లాంచ్ అవుతోంది. అయితే, ఈ ఎయిర్ బడ్స్ ప్రైస్ ని బోట్ ఏవిధంగా సెట్ చేస్తుందో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo