Vivo X200 FE: చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ డిజైన్ అండ్ పవర్ ఫుల్ ZEISS కెమెరాతో లాంచ్ అవుతోంది.!
ఇప్పటికే వరసపెట్టి కొత్త ఫోన్ లను విడుదల చేసిన వివో కొత్త ఫోన్ లాంచ్ కోసం అప్డేట్స్ అందించింది
వివో ఇపుడు X200 FE స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ డిజైన్ అండ్ పవర్ ఫుల్ ZEISS కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు వివో తెలియ చేసింది
Vivo X200 FE: 2025 సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారీగా ఊపందుకుంది. ఇప్పటికే వరసపెట్టి కొత్త ఫోన్ లను విడుదల చేసిన వివో సైతం కొత్త ఫోన్ లాంచ్ కోసం అప్డేట్స్ అందిస్తోంది. రీసెంట్ గా T4 సిరీస్ నుంచి ప్రీమియం ఫోన్ టి4 అల్ట్రా విడుదల చేసిన వివో ఇపుడు X200 FE స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ ఫోన్ ను చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ డిజైన్ అండ్ పవర్ ఫుల్ ZEISS కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు వివో టీజింగ్ ద్వారా తెలియ చేసింది.
SurveyVivo X200 FE: లాంచ్ డేట్
వివో ఎక్స్ 200 FE స్మార్ట్ ఫోన్ ను జూలై 14వ తేదీ భారత మార్కెట్లో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ కూడా ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తున్నాయి. ఈ టీజర్ పేజిల నుంచి ఈ అప్ కమింగ్ స్పెక్స్ మరియు ఫీచర్స్ తో వివో టీజింగ్ మొదలు పెట్టింది.
Vivo X200 FE: కీలక ఫీచర్లు
వివో ఎక్స్ 200 FE స్మార్ట్ ఫోన్ ఒక్క చేతిలో ఇమిడిపోయే 6.3 ఇంచ్ స్క్రీన్ కలిగిన కాంపాక్ట్ డిజైన్ కలిగి ఉంటుందని వివో తెలిపింది. ఈ ఫోన్ కేవలం 7.9mm మందంతో స్లీక్ గా ఉంటుంది మరియు 186 గ్రాముల బరువుతో లైట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు రంగుల్లో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ అంబర్ ఎల్లో, ఫ్రాస్ట్ బ్లూ మరియు లూస్ గ్రే మూడు రంగుల్లో లాంచ్ అవుతుంది.

వివో ఈ ఫోన్ ను గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. అదే, మీడియాటెక్ Dimensity 9300+ చిప్ సెట్ మరియు ఇది 4 + 4 బిగ్ కోర్ CPU ఆర్కిటెక్చర్ తో ఉంటుంది. ఈ మీడియాటెక్ ప్రోసెసర్ గరిష్టంగా 3.4GHz అల్ట్రా హై క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా వివో టీజింగ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది ఈ సెటప్ లో 50MP ZEISS Sony IMX 921 విసిఎస్ బయోనిక్ మెయిన్ కెమెరా, 50MP Sony IMX 882 ZEISS టెలిఫోటో సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ లో టన్నుల కొద్దీ ZEISS కెమెరా ఫీచర్స్ ఉంటాయని వివో తెలిపింది.
Also Read: Oppo Reno 14 Pro 5G ప్రైస్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ మరిన్ని వివరాలు కూడా వివో బయటకు వెల్లడించింది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటెడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ సపోర్ట్ వివరాలు కూడా వివో టీజింగ్ చేసింది. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే వివో వెల్లడిస్తుంది.