Realme 15 మరియు 15 Pro స్మార్ట్ ఫోన్ లను ఇండియాలో లాంచ్ చేయడానికి రియల్ మీ సిద్దమయ్యింది. ఇటీవల రియల్ మీ GT సిరీస్ నుండి కొత్త ఫోన్లు విడుదల చేసిన రియల్ మీ ఇప్పుడు రియల్ మీ 15 సిరీస్ నుండి కొత్త ఫోన్ లను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లను AI సపోర్ట్ తో లాంచ్ చేయబోతున్నట్లు రియల్ మీ టీజింగ్ చేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Realme 15 మరియు 15 Pro : లాంచ్
రియల్ మీ 15 మరియు 15 ప్రో రెండు స్మార్ట్ ఫోన్ లను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. అయితే, అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం కంపెనీ అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో ఉండనున్న ఫీచర్స్ గురించి హింట్ కూడా ఇచ్చింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను AI Party Phone ట్యాగ్ లైన్ మరియు హ్యాష్ ట్యాగ్ తో రియల్ మీ టీజింగ్ చేస్తోంది.
రియల్ మీ 15 సిరీస్ నుంచి రియల్ మీ 15 మరియు రియల్ మీ 15 ప్రో రెండు ఫోన్లు లాంచ్ కోసం రియల్ మీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో కొన్ని ఫీచర్స్ గురించి హింట్ ఇచ్చింది. ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న కార్ వెనుక భాగంలో ఉన్న బెలూన్స్ తో పాటు ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ గురించి హింట్ ఇచ్చింది.
ఇమేజ్ లో అందించిన హింట్ ప్రకారం, ఈ అప్ కమింగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు క్వాల్కమ్ Snapdragon చిప్ సెట్ తో వస్తాయి. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ లలో పెద్ద బ్యాటరీ ఉంటుందని కూడా తెలుస్తోంది. వీటితో పాటు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్లు పవర్ ఫుల్ కెమెరా సెటప్ మరియు AI సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేసింది.
అంటే, రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కలిగిన టాప్ 5 ఫీచర్స్ గురించి హింట్ ఇచ్చేలా ఇమేజ్ కనిపిస్తుంది. రియల్ మీ 15 సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్ల లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్లు కలిగిన కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.