Samsung Galaxy M36 5G: అంచనా ప్రైస్ మరియు ఫీచర్లు లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!
Samsung Galaxy M36 5G శుక్రవారం ఇండియాలో విడుదల అవుతుంది
స్లీక్ డిజైన్ సరికొత్త కెమెరా సెటప్ మరియు సరికొత్త కలర్ సెటప్ తో లాంచ్ కోసం సిద్ధం
అంచనా ధర మరియు ఫీచర్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి
Samsung Galaxy M36 5G: శామ్సంగ్ గెలాక్సీ ఎం సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎం 36 స్మార్ట్ ఫోన్ శుక్రవారం ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ సరికొత్త కెమెరా సెటప్ మరియు సరికొత్త కలర్ సెటప్ తో లాంచ్ కోసం సిద్ధం అవుతోంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ధర మరియు ఫీచర్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ అంచనా ధర మరియు ఫోన్ ఫీచర్లు ఏమిటో ఒకే లుక్కేద్దాం పదండి.
SurveySamsung Galaxy M36 5G : లాంచ్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 36 5జి స్మార్ట్ ఫోన్ జూన్ 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ అందించింది టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలతో శామ్సంగ్ ఆటపట్టిస్తోంది. అయితే, ఈ ఫోన్ అంచనా ధర మాత్రం నెట్టింట్లో దర్శనమిచ్చింది.
Samsung Galaxy M36 5G : అంచనా ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 36 5జి స్మార్ట్ ఫోన్ 7.7mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ ను 6.7 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ సపోర్ట్ తో చాలా పటిష్టంగా ఉంటుంది. ఈ ఫోన్ స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తుంది మరియు మూడు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఇందులో గూగుల్ సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్ కూడా ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం 36 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP OIS ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ AI డెప్త్ మ్యాప్, నైట్ పోర్ట్రైట్ మరియు మల్టీ ఫ్రేమ్ సింథసిస్ వంటి చాలా ఫీచర్స్ తో పాటు AI కెమెరా ఫీచర్స్ కూడా ఉంటాయి. అంతేకాదు, ఇందులో భారీ బ్యాటరీ, అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో FHD టీవీ రేటుకే లభిస్తున్న 4K QLED Smart Tv : ఎక్కడంటే.!
శామ్సంగ్ గెలాక్సీ ఎం 36 5జి : అంచనా ధర
శామ్సంగ్ గెలాక్సీ ఎం 36 5జి స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ. 20,000 ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఇది కేవలం అంచనా ధర మాత్రమే అని గమనించాలి. శామ్సంగ్ అఫీషియల్ గా ప్రకటించే వరకు మనం అఫీషియల్ ప్రైస్ ను నిర్ధారించలేము.