Samsung Galaxy S24 Ultra 5G పై అతి భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Samsung Galaxy S24 Ultra 5G భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది
S24 Ultra 5G ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఎన్నడూ చూడనంత తక్కువ ధరలో లభిస్తోంది
ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది
Samsung Galaxy S24 Ultra 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఎన్నడూ చూడనంత తక్కువ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం ఇండియన్ మార్కెట్లో భారీ ఫీచర్స్ మరియు ప్రీమియం బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ 77 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
SurveySamsung Galaxy S24 Ultra 5G: ఆఫర్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 1,29,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు కార్ట్ భారీ రూ. 45,041 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 84,958 రూపాయల డిస్కౌంట్ ధరకు సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఆప్షన్ తో 12 నెలల EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 7,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 77,458 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. అంటే, ఈరోజు శామ్సంగ్ పవర్ ఫుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరలో అందుకునే అవకాశం ఉంది.
Also Read: Vivo Y400 Pro 5G: సెగ్మెంట్ లో అతి సన్నని 3D కర్వుడ్ డిస్ప్లే ఫోన్ గా ఎంట్రీ ఇచ్చింది.!
Samsung Galaxy S24 Ultra 5G: ఫీచర్స్
ఈ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ పరిమాణం కలిగిన Edge AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు QHD+ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ టైటానియం ఫ్రేమ్ మరియు గొరిల్లా ఆర్మర్ గ్లాస్ తో చాలా కఠినమైన బిల్డ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12 GB ర్యామ్ మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 14 OS తో OneUI సాఫ్ట్ వేర్ పై నడుస్తుంది మరియు ఫోన్ వచ్చిన వెంటనే ఆండ్రాయిడ్ 15 అప్డేట్ అందుకుంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ సూపర్ ప్రీమియం కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 200MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్, 12MP అల్ట్రా వైడ్, 10MP టెలీ ఫోటో కెమెరా కలిగిన రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ UHD 8K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ S-Pen సపోర్ట్ తో కూడా వస్తుంది.