Realme Narzo 80 Lite : లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు అనౌన్స్ చేసిన రియల్ మీ.!
Realme Narzo 80 Lite లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా వివో రివీల్ చేసింది
లాంగ్ లాస్టింగ్ బిగ్ బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు వివో టీజింగ్ చేస్తోంది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ తో కూడా టీజింగ్ చేస్తోంది
Realme Narzo 80 Lite: రియల్ మీ అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా వివో రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లాంగ్ లాస్టింగ్ బిగ్ బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు వివో టీజింగ్ చేస్తోంది. రియల్ మీ తీసుకు వస్తున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా.
SurveyRealme Narzo 80 Lite లాంచ్ డేట్
రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ ను జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయడానికి డేట్ మరియు టైమ్ ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది మరియు ఈ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ తో కూడా టీజింగ్ చేస్తోంది.
Realme Narzo 80 Lite : ఏమిటా కీలక ఫీచర్స్?
రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ ను అతిపెద్ద మరియు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో లాంచ్ రియల్ మీ చేయబోతోంది. అదేమిటంటే, ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ను ఒక్కసారి ఫుల్ గా ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించవచ్చని కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కేవలం 7.94mm మందంతో ఉన్నా కూడా పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి ఉండటమే కాకుండా రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ వెనుక పెద్ద కెమెరా బంప్ కలిగి ఉంటుంది మరియు ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ టీజర్ పేజీ ద్వారా అందించిన ఇమేజ్ ద్వారా అర్థమయ్యేలా చేసింది.
Also Read: New AC Rules : ఏసీల వాడకంపై కొత్త రూల్స్ అనౌన్స్ చేసిన ప్రభుత్వం.!
Realme Narzo 80 Lite : అంచనా ఫీచర్స్
రియల్ మీ ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా, 6.7 ఇంచ్ HD+ స్క్రీన్ ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ను అండర్ రూ. 10,000 బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ నుంచి ఎటువంటి అప్డేట్ ఇంకా విడుదల కాలేదు.