Google Store: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ భారత్ లో కొత్తగా ఆన్లైన్ గూగుల్ స్టోర్ లను లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో కేవలం ఫ్లిప్ కార్ట్ ద్వారా మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా మాత్రమే అమ్మకాలు చేపట్టిన గూగుల్, ఇప్పుడు తన ఆన్లైన్ స్టోర్ నుంచి అన్ని గూగుల్ ప్రోడక్ట్స్ ని నేరుగా సేల్ చేస్తుంది. ఈ కొత్త పరిణామంతో యూజర్ కు మరింత అనువైన మరియు గొప్ప సర్వీస్ అందించడానికి వీలుంటుందని గూగుల్ యోచిస్తోంది. ఈ కొత్త స్టెప్ తో గూగుల్ ఇండియాలో తన డైరెక్ట్ టూ కంజ్యూమర్ ఉనికిని తెలియ చేసింది.
Survey
✅ Thank you for completing the survey!
Google Store:
గూగుల్ తీసుకు వచ్చిన ఆన్లైన్ గూగుల్ స్టోర్ నుంచి ప్రొడక్ట్స్ ను నేరుగా ఆఫర్ చేయడమే కాకుండా బ్యాంక్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఎక్స్ చేంజ్ బోనస్ మరియు ఇన్స్టాంట్ క్యాష్ బ్యాంక్ వంటి మరిన్ని ఆఫర్లు అందిస్తుంది.
గూగుల్ ఆన్లైన్ స్టోర్ నుంచి ఇప్పుడు చాలా స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డీల్స్ అందిస్తోంది. ఈ స్టోర్ నుంచి గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ పై గొప్ప ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను రూ. 15,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 34,999 ప్రైస్ తో లిస్ట్ చేసింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్ తో కొనే వారికి రూ. 3,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశం అందించింది. ఇది కాకుండా ఈ గూగుల్ ఫోన్ పై 3 నెలలు మొదలు కొని గరిష్టంగా 24 నెలల వరకు no Cost EMI ఆఫర్ కూడా అందించింది. అంటే, 24 నెలలు ఎటువంటి వడ్డీ లేకుండా తక్కువ EMI తో ఈ గూగుల్ ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశం అందించింది.
గూగుల్ ఇటీవల విడుదల చేసిన గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ పై కూడా గొప్ప డీల్స్ అందించింది. ఈ ఫోన్ రూ. 49,999 ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ధరతో సేల్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ పై గొప్ప ఆఫర్స్ గూగుల్ అందించింది. గూగుల్ ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల వరకు HDFC బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ మరియు గరిష్టంగా 24 నెలల No Cost EMI ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను అతి తక్కువ EMI తో అందుకునే అవకాశం గూగుల్ అందించింది.
కేవలం ఈ రెండు ఆఫర్స్ మాత్రమే కాదు, గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో XL మరియు గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్స్ పై కూడా గొప్ప బ్యాంక్ ఆఫర్స్ అందించింది. అంతేకాదు, గూగుల్ Pixel Watch 3, పిక్సెల్ వాచ్ 2 వంటి మరిన్ని వేరబుల్ Pixel Buds Pro 2 ఇయర్ బడ్స్ పై సైతం గొప్ప డీల్స్ అందించింది.