Jio Hotstar: రూ. 200 కంటే తక్కువ ధరలో హాట్ స్టార్ యాక్సెస్ అందించే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.!
జియో, ఎయిర్టెల్ మరియు Vi ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జతగా బెస్ట్ ప్లాన్స్ అందించాయి
తక్కువ ధరలో ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ కు యాక్సెస్ అందించే బెస్ట్ ప్లాన్స్
జియో హాట్ స్టార్ యాక్సెస్ ఉచితంగా అందించే బెస్ట్ ప్లాన్స్
Jio Hotstar: జియో, ఎయిర్టెల్ మరియు Vi టెలికాం కంపెనీలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జతగా బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించాయి. ముఖ్యంగా చాలా తక్కువ ధరలో ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ కు యాక్సెస్ అందించే బెస్ట్ ప్లాన్స్ అందించాయి. వీటిలో రూ. 200 కంటే తక్కువ ధరలో ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ యాక్సెస్ అందించే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఈరోజు చర్చించనున్నాము.
Surveyఎయిర్టెల్ రూ. 100 ప్లాన్
ఎయిర్టెల్ యొక్క రూ. 100 రూపాయల డేటా ప్లాన్ జియో హాట్ స్టార్ 30 రోజుల యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన 5GB డేటా కూడా అందిస్తుంది.
ఎయిర్టెల్ రూ. 195 ప్లాన్
ఇది కూడా ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న డేటా ప్యాక్. ఈ రూ. 195 రూపాయల డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ కలిగిన 15GB డేటా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 90 రోజుల జియో హాట్ స్టార్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

జియో రూ. 100 ప్లాన్
జియో యొక్క రూ. 100 రూపాయల డేటా ప్లాన్ తో జియో హాట్ స్టార్ 90 రోజుల యాక్సెస్ అందిస్తుంది. ఇది యాడ్ ప్యాక్ మరియు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 90 రోజుల వ్యాలిడిటీ కలిగిన 5GB డేటా కూడా అందిస్తుంది.
జియో రూ. 195 ప్లాన్
ఇది జియో ఆఫర్ చేస్తున్న క్రికెట్ డేటా ప్యాక్. ఈ డేటా ప్యాక్ రూ. 195 రూపాయల ధరలో వస్తుంది మరియు 90 రోజుల వ్యాలిడిటీ కలిగిన 15GB డేటా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో హాట్ స్టార్ 90 రోజుల యాక్సెస్ కూడా లభిస్తుంది.
Also Read: Motorola Razr 60: కూల్ డిజైన్ మరియు ఫీచర్స్ తో వచ్చింది.!
Vi రూ. 101 డేటా ప్లాన్
ఇది వోడాఫోన్ ఐడియా ఆఫర్ చేస్తున్న యాడ్ ఆన్ ప్యాక్. ఈ యాడ్ ఆన్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజుల జియో హాట్ స్టార్ యాక్సెస్ లభిస్తుంది మరియు 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన 5GB డేటా కూడా అందిస్తుంది.
Vi రూ. 151 డేటా ప్లాన్
ఇది కూడా వోడాఫోన్ ఐడియా అందించిన యాడ్ ఆన్ ప్యాక్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజుల జియో హాట్ స్టార్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, 30 రోజులు చెల్లుబాటు కలిగిన 4GB డేటా కూడా లభిస్తుంది.