Jio HotStar ఉచితంగా అందించే జియో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే.!
Jio HotStar సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందుకునే అవకాశం
దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు
రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది
Jio HotStar సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందుకునే అవకాశం ఇప్పుడు జియో తన యూజర్ల కోసం అందించింది. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. జియో యూజర్ల కోసం రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఏమిటో వివరంగా చూద్దాం.
SurveyJio HotStar Plan
రిలయన్స్ జియో యొక్క చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నాయి. అయితే, వీటిలో బడ్జెట్ ధరలో ఈ ప్రయోజనాన్ని అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కొన్నే ఉన్నాయి. ఆ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇప్పుడు చూద్దాం.
రూ. 100 జియో ప్లాన్
జియో రీసెంట్ గా అందించిన రూ. 100 డేటా ప్యాక్ అతి చవక ధరలో జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ డేటా ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఇది యాడ్ ఆన్ ప్యాక్ మరియు ఈ ప్లాన్ తో 5GB డేటా కూడా లభిస్తుంది. 90 రోజుల జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది.

రూ. 195 జియో ప్లాన్
ఈ ప్లాన్ కూడా జియో అందించిన డేటా ప్యాక్. ఇది డేటా ప్యాక్ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 15 GB డేటా మరియు 90 రోజుల జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
Also Read: 6 వేల బడ్జెట్ ధరలో లభించే ఏకైక Dolby Atmos సౌండ్ బార్ గురించి మీకు తెలుసా.!
జియో రూ. 899 ప్లాన్
ఇది చూడటానికి ఎక్కువ ప్రైస్ తో కనిపించినా ఈ ప్లాన్ ఎక్కువ రోజులు చెల్లుబాటు అయ్యే కంప్లీట్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా, 20 GB అదనపు డేటా మరియు డైలీ 100SMS వంటి సాధారణ ప్రయోజనాలు అందిస్తుంది. ఇవి కాకుండా ఈ ప్లాన్ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా కూడా అందిస్తుంది. ఇక అదనపు ప్రయోజనాలను చూస్తే, ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజుల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది.
ఈ మూడు ప్లాన్స్ కూడా బడ్జెట్ ధరలో జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా చెప్పబడతాయి.