Motorola Edge 50 Fusion పై రూ. 5,500 రూపాయల భారీ తగ్గింపు అందుకోండి.!

HIGHLIGHTS

Motorola Edge 50 Fusion స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపు అందుకుంది

ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 5,500 రూపాయల భారీ తగ్గింపు అందుకుంది

ఈ ఫోన్ ను కేవలం రూ. 17,499 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు

Motorola Edge 50 Fusion పై రూ. 5,500 రూపాయల భారీ తగ్గింపు అందుకోండి.!

Motorola Edge 50 Fusion స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపు అందుకుంది. భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గా విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ తగ్గింపు తో చాలా తక్కువ ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు Sony బిగ్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 5,500 రూపాయల భారీ తగ్గింపు అందుకుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Motorola Edge 50 Fusion: ఆఫర్

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 22,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 4,000 రూపాయల భారీ తగ్గింపు తో రూ. 18,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.

ఈ మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు రూ. 1,500 రూపాయల IDFC బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఫోన్ ను IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపు ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 17,499 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు.

Also Read: LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

Motorola Edge 50 Fusion: ఫీచర్స్

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వస్తుంది మరియు 6.7 ఇంచ్ ఎండ్ లెస్ ఎడ్జ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 144Hz రిఫ్రెష్ రేట్, 1600 పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Motorola Edge 50 Fusion

ఈ ఫోన్ 50MP (Sony Lytia 700C) ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30fps తో 4K UHD వీడియో రికార్డ్, 8X జూమ్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 14OS తో వస్తుంది మరియు 3 సంవత్సరాల OS అప్డేట్స్ అందుకుంటుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 68W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo