IPL 2025: ఐపీఎల్ సందడి మొదలయ్యింది మరియు ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం అవుతాయి. అయితే, ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ చూడాలంటే మాత్రం జియో హాట్ స్టార్ ను ఆశ్రయించాల్సిందే. జియో హాట్ స్టార్ యాప్ తో ఎక్కడ నుంచైనా ఐపీఎల్ మ్యాచ్ లను లైవ్ చూసే అవకాశం ఉంటుంది. మరి ఈ జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందాలనుకుంటే జియో ఏ ప్లాన్ రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
IPL 2025:
రిలయన్స్ జియో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా తన యూజర్లకు ఉచిత జియో హాట్ స్టార్ షబ్ స్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తోంది. జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో మూడు ప్రీపెయిడ్ ప్లాన్ లను తన యూజర్ల కోసం ఆఫర్ చేస్తోంది. రూ. 100 డేటా ప్యాక్, రూ. 195 క్రికెట్ డేటా ప్యాక్ మరియు రూ. 949 లాంగ్ అన్లిమిటెడ్ ప్లాన్ ఉన్నాయి.
ఈ రెండు ప్లాన్స్ కూడా డేటా లాభాలు మరియు 90 రోజుల జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తాయి. వీటిలో రూ. 100 రూపాయల డేటా ప్లాన్ 5GB డేటా మరియు 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అయితే, రూ. 195 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 15GB డేటా మరియు 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.
జియో రూ. 949 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్
జియో యొక్క ఈ రూ. 949 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100SMS లిమిటెడ్ అందిస్తుంది. అలాగే, 4జి నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ జియో హాట్ స్టార్ 84 రోజుల ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఇది కాకుండా జియో టీవీ మరియు జియో క్లౌడ్ యాప్స్ కి కూడా ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.