Realme P3 Ultra: బడ్జెట్ సూపర్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!

HIGHLIGHTS

ఆల్ రౌండ్ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ టీజింగ్

Realme P3 Ultra ను మార్చి 19న మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు రియల్ మీ ప్రకటించింది

ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది

Realme P3 Ultra: బడ్జెట్ సూపర్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!

Realme P3 ultra: గత నెల ఇండియన్ మార్కెట్లో Realme P3 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన రియల్ మీ, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి పి 3 అల్ట్రా ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆల్ రౌండ్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ అందించే ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ కలిగి లేని ఫీచర్స్ కలిగి ఉంటుందని కూడా రియల్ మీ గొప్పగా చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P3 Ultra: లాంచ్

రియల్ మీ పి అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను మార్చి 19న మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ ను కూడా Flipkart సేల్ పార్ట్నర్ గా అందిస్తుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.

Realme P3 ultra: ఫీచర్స్

రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సేమ్ ప్రైస్ రేంజ్ లో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే గొప్ప చిప్ సెట్ తో లాంచ్ చేస్తుందట. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 8350 Ultra తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ చిప్ సెట్ తో విడుదలయ్యే మొదటి ఇదే మరియు ఇది 14,50,000 కంటే అధికమైన AnTuTu స్కోర్ అందిస్తుందని కూడా రియల్ మీ తెలిపింది. అంటే, ఈ ఫోన్ ధర తక్కువ ఉంటుంది మరియు ఈ ఫోన్ డబుల్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని అర్థం వచ్చేలా రియల్ మీ హింట్ ఇచ్చింది.

Realme P3 Ultra

ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్ కు తోడుగా ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ అందించే 12GB LPDDR 5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ 6000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ మరియు 80W AI బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో అతి పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ను కూడా అందించింది.

Also Read: iQOO Neo 10R : రేపు విడుదల కాబోతున్న కొత్త ఫోన్ వివరాలు ముందే తెలుసుకోండి.!

ఇది కాకుండా ఈ ఫోన్ లో 2500 Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 90FPS స్టేబుల్ గేమింగ్ 3 గంటల వరకు అందించే స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ మార్చి 13వ తేదీన రియల్ మీ రివీల్ చేస్తుందట.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo