iQOO Neo 10R : రేపు విడుదల కాబోతున్న కొత్త ఫోన్ వివరాలు ముందే తెలుసుకోండి.!
iQOO Neo 10R రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతోంది
గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ గొప్పగా చెబుతోంది
రేపు విడుదల కాబోతున్న ఈ కొత్త ఫోన్ వివరాలు ముందే తెలుసుకోండి
iQOO Neo 10R రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి గత నెల రోజులుగా కంపెనీ గొప్పగా టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను శక్తివంతమైన చిప్ సెట్, స్టన్నింగ్ డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ గొప్పగా చెబుతోంది. రేపు విడుదల కాబోతున్న ఈ కొత్త ఫోన్ వివరాలు ముందే తెలుసుకోండి.
SurveyiQOO Neo 10R : లాంచ్ & ఫీచర్స్
ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది. ఇది 4nm TSMC ప్రోసెసర్ మరియు 1.7 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా వేగవంతమైన LPDDR5X RAM మరియు 256GB UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ డిజైన్ అందంగా కనిపిస్తుంది మరియు చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో స్టేబుల్ 90FPS డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్, 1.5K రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 2000Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP Sony OIS ప్రధాన కెమెరా + 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ AI Camera ఫీచర్స్ మరియి ఇతర AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: భారీ ఆఫర్స్ తో Nothing Phone (2a) Plus ఫస్ట్ సేల్.!
ఈ స్మార్ట్ ఫోన్ భారీ 6400 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ మరియు డస్ట్ ప్రూఫ్ ను కలిగి ఉంటుంది. డిడ్ కాకుండా ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ Funtouch OS 15 సాఫ్ట్ వేర్ తో Android 15 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. ఈ ఫోన్ ర్యాగింగ్ బ్లూ మరియు మూన్ నైట్ టైటానియం రెండు రంగుల్లో లభిస్తుంది.
రేపు సాయంత్రానికి ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ మరియు రేటుతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది.