Vivo T4x 5G: 6500 mAh భారీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో రేపు లాంచ్ అవుతుంది.!

HIGHLIGHTS

వివో టి4x స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి

ఈ వివో ఫోన్ ఫీచర్స్ మరియు అంచనా ధర వివరాలు ఈరోజే చూద్దాం

Vivo T4x 5G: 6500 mAh భారీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో రేపు లాంచ్ అవుతుంది.!

Vivo T4x 5G : వివో కొత్త ఫోన్ వివో టి4x స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి. ఈ ఫోన్ 6500 mAh భారీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో రేపు లాంచ్ అవుతుంది. రేపు విడుదల కానున్న ఈ వివో ఫోన్ ఫీచర్స్ మరియు అంచనా ధర వివరాలు ఈరోజే చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T4x 5G : ఫీచర్స్

వివో ఈ ఫోన్ ను 6500 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అన్నింటికంటే ముందు ఈ ఫీచర్ గురించే కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ పెద్ద బ్యాటరీని వేగవంతంగా ఛార్జ్ చేసే 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. విప్ టి4x 5జి స్మార్ట్ ఫోన్ ను వేగవంతమైన మీడియాటెక్ 5జి చిప్ సెట్ Dimensity 7300 తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ తో ఈ ఫోన్ 7,28,000 లకు పైగా AnTuTu స్కోర్ అందిస్తుందని కూడా వివో తెలిపింది.

Vivo T4x 5G

ఈ ఫోన్ ను ప్రాంతో పర్పల్ మరియు మెరైన్ బ్లూ అనే రెండు రంగుల్లో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వస్తుంది. విప్ టి4x 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా వ్ వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ ను 6.67 ఇంచ్ FHD+ స్క్రీన్ తో కూడా అందించవచ్చు.

Also Read: Nothing Phone (3a) Pro: స్టన్నింగ్ ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ అయ్యింది.!

Vivo T4x 5G : అంచనా ధర

ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో కేవలం రూ. 12,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అందించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ రేవు లాంచ్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ పై కప్పి ఉన్న అన్ని పరదాలు రేపటితో తొలగిపోతాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo