JVC QLED Smart Tv పై అమెజాన్ జబర్దస్త్ అఫర్: చవక ధరకే పెద్ద టీవీ అందుకోండి.!
JVC QLED Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డీల్స్ ప్రకటించింది
స్మార్ట్ టీవీలు ఇప్పుడు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి
43 ఇంచ్ మరియు 50 ఇంచ్ స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరకే అందుకే అవకాశం
JVC QLED Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డీల్స్ ప్రకటించింది. భారత మార్కెట్లో ఇటీవల విడుదలైన ఈ స్మార్ట్ టీవీలు ఇప్పుడు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా 43 ఇంచ్ మరియు 50 ఇంచ్ స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరకే అందుకే అవకాశం అమెజాన్ అందించింది. ఈ టీవీలు అమెజాన్ కస్టమర్ల నుంచి 4.3 రేటింగ్ అందుకున్నాయి.
SurveyJVC QLED Smart Tv: ఆఫర్స్
ప్రముఖ జపనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ JVC ఇండియాలో రీసెంట్ గా AI Vision Series నుంచి QLED స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి 32 ఇంచ్ మొదలుకొని 75 ఇంచ్ వరకు టీవీ లను అందించింది. అందులో, 43 ఇంచ్ మరియు 50 మించి స్మార్ట్ టీవీ పై అమెజాన్ గొప్ప డీల్స్ అందించింది.
43 ఇంచ్ స్మార్ట్ టీవీ రూ. 24,999 రూపాయల ధరతో లాంచ్ అవ్వగా, ఈరోజు వెయ్యి రూపాయల డిస్కౌంట్ తో రూ. 23,999 రూపాయల ధరకే అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 21,499 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు.

ఇక 50 ఇంచ్ స్మార్ట్ టీవీ విషానికి వస్తే, ఈ టీవీ రూ, 29,999 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 26,499 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here
IDFC FIRST, Federal, HSBC మరియు BOBCARD EMI ఆప్షన్ తో ఈ టీవీ లను కొనే వారికి ఈ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Noise Master Buds: Bose సౌండ్ తో వచ్చిన కొత్త బడ్స్ సేల్ బెస్ట్ డీల్స్ తో ప్రారంభం.!
JVC QLED Smart Tv: ఫీచర్స్
ఈ JVC క్యూలెడ్ స్మార్ట్ టీవీ లు HDR 10 మరియు HLG సపోర్ట్ తో వస్తాయి మంచి విజువల్స్ అందిస్తాయి. ఈ టీవీలు రియల్ టెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తాయి మరియు 2GB ర్యామ్ + 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ టీవీ లలో 60W హెవీ సౌండ్ అందించే స్పీకర్లు ఉన్నాయి. అంతేకాదు, DTS మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటాయి.
ఇందులో HDMI, USB, బ్లూటూత్, ALLM, eARC, ఆప్టికల్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ టీవీ లను ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.