Realme P3x 5G స్మార్ట్ ఫోన్ ను కూడా ఇండియాలో విడుదల చేయనున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఇటీవల ప్రకటించిన Realme P3 Pro 5G తో పాటు ఈ ఫోన్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ డిజైన్ మరియు కీలకమైన ఫీచర్స్ తో రియల్ మీ టీజర్ ను అందించింది. ఇప్పటి వరకు కేవలం రియల్ మీ పి 3 ప్రో ఫోన్ తో మాత్రమే టీజింగ్ చేస్తున్న రియల్ మీ ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి రాబోతున్న మరో అప్ కమింగ్ ఫోన్ తో కూడా టీజింగ్ మొదలు పెట్టింది.
Survey
✅ Thank you for completing the survey!
Realme P3x 5G : లాంచ్
రియల్ మీ పి 3x 5జి స్మార్ట్ ఫోన్ ను కూడా రియల్ మీ పి 3 ప్రో తో పాటు ఫిబ్రవరి 18 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ కోసం కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.
రియల్ మీ పి 3x 5జి స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ కేవలం 7.94mm మందంతో ఉంటుంది మరియు చాలా తేలికగా కూడా ఉంటుందట. ఈ ఫోన్ ప్రీమియం వేగాన్ లెథర్ బ్యాక్ తో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మిడ్ నైట్ బ్లూ, లూనార్ సిల్వర్ మరియు స్టెల్లార్ పింక్ మూడు కలర్ ఆప్షన్ లలో అందిస్తున్నట్లు కూడా రియల్ మీ అనౌన్స్ చేసింది.
ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6400 5G చిప్ సెట్ తో రియల్ మీ లాంచ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను టాప్ టైర్ వాటర్ ప్రూఫ్ IP69 రేటింగ్ తో అందిస్తుంది. అంటే, ఇది వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ కూడా ఉంటుంది. రియల్ మీ పి 3x 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.