ప్రేమికుల రోజు సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన వాలెంటైన్స్ సేల్ నుంచి మంచి ఆఫర్లు అందిస్తోంది. పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి కూడా ఈరోజు బెస్ట్ టీవీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ తో 40 వేల బడ్జెట్ లో లభిస్తున్న బ్రాండెడ్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా 65 ఇంచ్ QLED Smart Tv ఆఫర్?
MOTOROLA యొక్క EnvisionX సిరీస్ నుంచి విడుదల చేసిన 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (65UHDGQMBSGQ) పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 69% భారీ డిస్కౌంట్ అందుకుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ భారీ డిస్కౌంట్ తో ఈ టీవీ రూ. 42,999 ధరకే సేల్ అవుతుంది.
ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 12 నెలల EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 41,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ మోటోరోలా 65 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ కలిగిన QLED ప్యానల్ తో మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మీడియాటెక్ 2 GB RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఇన్ బిల్ట్ గ్రాఫిక్స్ యూనిట్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ టీవీ Dolby Atmos, Dolby Digital మరియు Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 24W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.