Realme 14 Pro+ 5G స్మార్ట్ ఫోన్ పై వాలెంటైన్స్ డే బిగ్ డీల్ ప్రకటించిన రియల్ మీ.!

HIGHLIGHTS

Realme 14 Pro+ 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు గొప్ప డీల్స్ అందించింది

Realme Valentine’s day sale నుంచి అందించిన బిగ్ డీల్స్ లో ఇది కూడా ఒకటి

బ్యాంక్ డిస్కౌంట్, అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు మరిన్ని ఆఫర్లు అందించింది

Realme 14 Pro+ 5G స్మార్ట్ ఫోన్ పై వాలెంటైన్స్ డే బిగ్ డీల్ ప్రకటించిన రియల్ మీ.!

Realme 14 Pro+ 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు గొప్ప డీల్స్ అందించింది. ప్రేమికుల రోజు సందర్భంగా రియల్ మీ తీసుకు వచ్చిన Valentine’s day sale నుంచి అందించిన బిగ్ డీల్స్ లో ఇది కూడా ఒకటి. ఈ సేల్ నుంచి రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 14 Pro+ 5G పై బ్యాంక్ డిస్కౌంట్ మరియు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ వంటి మరియు మరిన్ని ఆఫర్లు అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 14 Pro+ 5G : ప్రైస్

రియల్ మీ 14 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 29,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో మూడు వేరియంట్లను ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు మూడు వేరియంట్స్ పై బెస్ట్ డీలా అందించింది.

Realme 14 Pro+ 5G : ఆఫర్లు

రియల్ మీ 14 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ యొక్క 8GB +128GB మరియు 8GB +256GB రెండు వేరియంట్స్ పై రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 27,999 స్టార్టింగ్ ప్రైస్ తో అందుకునే వీలుంది. అయితే, 12GB + 256GB హై ఎండ్ వేరియంట్ పై మాత్రం రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ జత చేసింది. ఈ ఆఫర్ ను అన్ని బ్యాంకుల డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై అందించింది. ఈ బ్యాంక్ ఆఫర్ realme.com మరియు Flipkart నుంచి కూడా అందుకోవచ్చు.

Realme 14 Pro+ 5G offer

బ్యాంక్ డిస్కౌంట్ కాకుండా ఈ ఫోన్ పై 12 నెలల No Cost EMI మరియు ఈ ఫోన్ పై ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను కూడా అందించింది. పాత ఫోన్ తో ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ద్వారా కొనుగోలు చేసే వారికి వారి ఫోన్ కు ఆఫర్ చేసే రేటుతో జతగా అదనపు బోనస్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకు అందుకునే అవకాశం అందించింది.

Also Read: Jio 2025 Plan: రీఎంట్రీ ఇచ్చిన రూ. 2025 అన్లిమిటెడ్ ప్లాన్.. ఆ బెనిఫిట్స్ మాత్రం ఉండవట.!

Realme 14 Pro+ 5G : ఫీచర్స్

రియల్ మీ 14 ప్రో+ 5g స్మార్ట్ ఫోన్ యూనిక్ పర్ల్ డిజైన్ మరియు కలర్ ఛేంజింగ్ ఫీచర్ తో అందించింది. ముందెన్నడూ లేని విధంగా ఈ ఫోన్ ను మ్యాజిక్ గ్లో ట్రిపుల్ ఫ్లాష్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 50MP పెరిస్కోప్, 50MP మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 4K వీడియోలు 30fps వద్ద షూట్ చేయగలదు మరియు మంచి ఫోటోలు అందిస్తుందని రియల్ మీ తెలిపింది.

ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 7s Gen 3 తో పని పని చేస్తుంది మరియు జతగా 12GB ర్యామ్ వరకు ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ లో 6.8 ఇంచ్ బిగ్ OLED స్క్రీ ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి వుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo