Jio 2025 Plan: రీఎంట్రీ ఇచ్చిన రూ. 2025 అన్లిమిటెడ్ ప్లాన్.. ఆ బెనిఫిట్స్ మాత్రం ఉండవట.!
Jio 2025 Plan ను మళ్ళీ తీసుకు వచ్చింది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు మళ్ళీ లిస్ట్ లో తన యధాస్థానంలో ప్రత్యక్షమయ్యింది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రధాన బెనిఫిట్స్ మాత్రం ఇప్పుడు అన్ లిస్ట్ అయ్యాయి
Jio 2025 Plan: నూతన సంవత్సర కానుకగా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ లో భాగంగా జియో డిసెంబర్ 2024 లో తీసుకు వచ్చిన రూ. 2025 ప్రీపెయిడ్ ప్లాన్ ను మళ్ళీ తీసుకు వచ్చింది. వాస్తవానికి, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను 2025 జనవరి 31 నుంచి నిలిపి వేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను ఇప్పుడు తిరిగి తన పోర్ట్ ఫోలియోకి జత చేసింది. ఫిబ్రవరి 1 నుంచి లిస్ట్ నుంచి మాయమైన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు మళ్ళీ లిస్ట్ లో తన యధాస్థానంలో ప్రత్యక్షమయ్యింది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో అందించిన ప్రధాన బెనిఫిట్స్ మాత్రం ఇప్పుడు అన్ లిస్ట్ అయ్యాయి.
Surveyఏమిటి ఈ Jio 2025 Plan?
2025 కొత్త సంవత్సర కానుకగా రిలియన్స్ జియో అందించిన కొత్త ప్రీపెయిడ్ ప్లానే ఈ రూ. 2025 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ రేటుకు సమానమైన ఉచిత లాభాలు జియో అందించింది. క్లియర్ గా చెప్పాలంటే, ఈ న్యూ ఇయర్ ఆఫర్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు రూ. 2150 రూపాయల విలువైన అదనపు లాభాలు కూడా అందించింది.
అయితే, ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ సహజ యూజర్లకు ఎటువంటి ఇతర ప్రయోజనాలు అందించడం లేదు. కేవలం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా వంటి ఇతర బెనిఫిట్స్ మాత్రమే ఆఫర్ చేస్తోంది.
Also Read: Nothing (3a) Series: కొత్త ఫీచర్స్ మరియు కొత్త డిజైన్ తో టీజ్ అవుతోంది.!
జియో రూ. 2025 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్
ఇక జియో రూ. 2025 ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్న బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ 200 రోజుల వ్యాలిడిటీ తీసుకు వస్తుంది. ఈ పూర్తి వ్యాలీటీడీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ మరియు Jio True 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది. ఒకవేళ 4G నెట్ వర్క్ అయితే, డైలీ 2.5GB చొప్పున 200 రోజులకు గాను 500GB ల అదనపు డేటా అందిస్తుంది.

అంతేకాదు, ఈ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేసే యూజర్లకు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఇవికాకుండా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో క్లౌడ్, జియో సినిమా మరియు జియో టీవీ లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.
మరిన్ని జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here