Realme 14 Pro Series 5G నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ లను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్ తో తీసుకు రాబోతున్నట్టు కూడా చెబుతోంది. ఈ ఫోన్ లను ‘Coming Soon’ ట్యాగ్ తో టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ కోల్డ్ సెన్సిటివ్ కలిగిన వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ గా తీసుకు రాబోతున్నట్లు కూడా టీజింగ్ చేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Realme 14 Pro Series: లాంచ్
రియల్ మీ 14 ప్రో సిరీస్ ను జనవరి నెలలో లాంచ్ చేస్తుందని రియల్ మీ హింట్ ఇచ్చింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్ యొక్క ఒక ప్రత్యేకమైన ఫీచర్ గురించి కూడా గొప్ప చెబుతోంది. అయితే, రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
రియల్ మీ 14 ప్రో సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను Thermo-Sensitive కలర్ ఛేంజింగ్ టెక్నాలజీ తో తీసుకువస్తున్నట్లు చెబుతోంది. అంతేకాదు, ఈ ఫీచర్ తో వస్తున్న మొదటి ఫోన్ కూడా ఇదే అని కూడా గొప్ప చెబుతోంది.
ఈ కొత్త ఫీచర్ విషయానికి వస్తే, ఈ ఫీచర్ తో తెచ్చే ఈ ఫోన్ 16 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ ఉన్నపుడు ఈ ఫోన్ కలర్ చేంజ్ అవుతుందట. ఈ ఫోన్ ను యూనిక్ పర్ల్ డిజైన్ తో అందిస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది.
ఈ కెమెరా సెటప్ లో ట్రిపుల్ LED ఫ్లాష్ లైట్ లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ ను కలిగి ఉంటుందని అర్థం అవుతోంది. ఈ ఫోన్ టైప్ C ఛార్జ్ పోర్ట్ మరియు స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది.