Redmi A4 5G First Sale: రెడ్ మీ గత వారం ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 10 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ ధరలో లేటెస్ట్ ప్రాసెసర్ మరియు మరిన్ని ఫీచర్లతో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Redmi A4 5G First Sale : ప్రైస్
షియోమీ ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 8,499 ధరకే లాంచ్ చేసింది. ఇది బేసిక్ వేరియంట్ (4GB + 64GB) కోసం అందించింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ (4GB + 64GB) ను రూ. 9,499 ధరతో విడుదల చేసింది.
ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. రెడ్ మీ A4 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్, mi stores మరియు mi.com నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ 6.88 ఇంచ్ HD+ (1640×720) స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 600 నిట్స్ పిక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 4s Gen 2 తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అయితే, ఈ ఫోన్ ఫాస్ట్ గా ఉంచడానికి వీలుగా 4GB వర్చువల్ ర్యామ్ ను కూడా అందించింది.
ఈ లేటెస్ట్ ఫోన్ లో వెనుక రియల్ కెమెరా ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా మరియు జతగా 5MP కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ను పెద్ద 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఛార్జ్ సపోర్ట్ తో పాటు 33W ఫాస్ట్ ఛార్జర్ ను ఫోన్ తో పాటు వచ్చే బాక్స్ లో అందిస్తుంది.