Jio Best 5G Plan: రిలయన్స్ జియో యూజర్లకు చాలా అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించింది. వాటిలో బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ 5జి లాభాలను అందించే ప్లాన్ గురించి మనం చూడనున్నాము. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ డేటా మరియు మరియు కాలింగ్ తో సహా మరిన్ని లాభాలను మూడు నెలల పాటు అందిస్తుంది. మరి రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటి మరియు ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఏమిటో ఒక తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా Jio Best 5G Plan?
రిలయన్స్ జియో ఇటీవల అందించిన కొత్త Hero 5G ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 899 గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో వస్తుంది మరియు లాంగ్ వ్యాలిడిటీ తో కూడా వస్తుంది.
జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తీసుకు వచ్చే 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది. అదే, 4జి నెట్ వర్క్ అయితే, రోజుకు 2GB డేటా చొప్పున 180GB ల డేటా మరియు 20GB అదనపు డేటా కలిపి టోటల్ 200GB హై స్పీడ్ 4జి డేటా అందిస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ లాభాన్ని పొందవచ్చు. దీనితో పాటు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇది కాకుండా 90 రోజులు జియో టీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ కోసం ఉచిత వినియోగ యాక్సెస్ ను కూడా పొందుతారు.
రీఛార్జ్ ఆఫర్లు చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ చేయడానికి Click Here