WhatsApp upcoming: యూజర్స్ కోసం Chat Filters ఫీచర్స్ తెస్తున్న వాట్సాప్.!
వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చే పనిలో పడింది
ఈ ఫీచర్ ను రానున్న అప్డేట్ తో అందిస్తుందని, వాబీటాఇన్ఫో తెలిపింది
త్వరలోనే వాట్సాప్ Chat Filters ఫీచర్ ను యాప్ లో జత చేస్తుంది
WhatsApp upcoming: వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చే పనిలో పడింది. వాట్సాప్ స్టేటస్ అప్డేట్ ను తిరిగి అప్డేట్ చేసుకోవాలి అనుకునే వారి కోసం రీ షేర్ వాట్సాప్ స్టేటస్ ఫీచర్ ను తేవడానికి ప్రయత్నిస్తోంది. దీనితో పాటు ఇప్పుడు మరొక ఫీచర్ గురించి కూడా ప్రస్తావన తీసుకు వచ్చింది. అదే వాట్సాప్ Chat Filters ఫీచర్ మరియు ఈ ఫీచర్ ను రానున్న అప్డేట్ తో అందిస్తుందని, వాబీటాఇన్ఫో తెలిపింది.
SurveyWhatsApp upcoming Chat Filters ఫీచర్
అప్ కమింగ్ అప్డేట్స్ తో వాట్సాప్ కొత్త చాట్ ఫిల్టర్స్ ఫీచర్ ను తీసుకువస్తుందని వాట్సాప్ అప్డేట్ లను ముందు అందించే వాబీటాఇన్ఫో తెలిపింది. వాబీటాఇన్ఫో X అకౌంట్ నుంచి ఈ అప్ కమింగ్ ఫీచర్ మరియు ఈ ఫీచర్ ఉపయోగాలు తెలియపరిచే స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది.
📝 WhatsApp beta for Android 2.24.20.13: what's new?
— WABetaInfo (@WABetaInfo) September 19, 2024
WhatsApp is working on a feature to create filters from the chats list, and it will be available in a future update!https://t.co/YBbygfPSQl pic.twitter.com/LPqBsqFmf2
వాబీటాఇన్ఫో ట్వీట్ ప్రకారం, వాట్సాప్ త్వరలోనే వాట్సాప్ చాట్ ఫిల్టర్స్ ఫీచర్ ను యాప్ లో జత చేస్తుంది. ఈ అప్ కమింగ్ ఫీచర్ తో యూజర్లు వారి అభిరుచికి మరియు అనుకూలతకు తగిన విధంగా చాట్ ఫిల్టర్స్ ను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. అంటే, చాట్ ను సులభంగా మేనేజ్ చేసుకోవడం కోసం కాంటాక్ట్ మరియు గ్రూప్ చాట్స్ కోసం ఒక ప్రత్యేకమైన లిస్ట్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.
అయితే, ఈ ఫీచర్ ప్రసుతం డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. కానీ, ఈ ఫీచర్ ను మరింత అనుకూలంగా మార్చడానికి వాట్సాప్ పని చేస్తోంది. అంతేకాదు, ఈ కొత్త ఫీచర్ తో కూడిన ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.24.20.13 అప్డేట్ ను గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచింది. బీటా టెస్టర్స్ ఈ అప్డేట్ ను ఇన్స్టాల్ చేసుకుని టెస్ట్ చేసే వీలుంది.

పైన అందించిన ఈ ఇమేజ్ లో వాట్సాప్ చాట్ ఫిల్టర్స్ ఫీచర్ ను చూడవచ్చు. వాట్సాప్ చాట్ బాక్స్ లో కొత్త బటన్స్ ఇందులో కనిపిస్తాయి. యూజర్ అవసరాన్ని లేదా అనుకూలతను బట్టి చాట్ లిస్ట్ ను చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎక్కువ చాట్ చేసి గ్రూప్ మరియు కాంటాక్ట్స్ డిఫాల్ట్ గా లిస్ట్ అవుతాయి.
Also Read: లేటెస్ట్ Redmi Fire Tv పై అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ ధమాకా ఆఫర్.!