OnePlus Nord Buds 3 ఇయర్ బడ్స్ ను వన్ ప్లస్ లాంచ్ చేస్తోంది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను ఇండియన్ మార్కెట్ లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తుంది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ కీలకమైన ఫీచర్స్ ను ముందే వన్ ప్లస్ అందించింది. ఈ బడ్స్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి మరియు ఎటువంటి డిజైన్ తో లాంచ్ అవుతోందో ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
OnePlus Nord Buds 3 : లాంచ్
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ను సెప్టెంబర్ 17 వ తేదీ, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తుంది. ఈ బడ్స్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది. అంటే, ఈ బడ్స్ లాంచ్ అయిన తరువాత అమెజాన్ ఇండియా నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ను ఆకట్టుకునే డిజైన్ లతో లాంచ్ చేస్తోంది. ఈ ఇయర్ బడ్స్ ను 32dB యాక్టివ్ నోయిస్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ తో లాంచ్ చేస్తునట్లు వన్ ప్లస్ తెలిపింది. రేపు విడుదల అవుతున్న ఈ ఇయర్ బడ్స్ Bass Wave 2.0 తో అల్ట్రా ఎం హెన్సెడ్ బాస్ తో అవస్తుంది. అంటే, ఇది మరింత గొప్ప BASS సౌండ్ అందిస్తుంది.
ఈ బడ్స్ లో అందించిన బ్యాటరీ గురించి కూడా వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది. అదేమిటంటే, బ్యాటరీ హెల్త్ కోసం TUV Rheinland సర్టిఫై కలిగిన వరల్డ్స్ ఫస్ట్ ఎఆర్ బడ్స్ ఇదే అని చెబుతోంది. అంతేకాదు, కేస్ మరియు బడ్స్ తో కలిపి టోటల్ 43 గంటల ప్లే బ్యాక్ ఈ బడ్స్ అందిస్తుందని వన్ ప్లస్ పేర్కొంది.
ఈ అప్ కమింగ్ బడ్స్ ఇమేజెస్ ద్వారా ఈ బడ్స్ లో క్వాడ్ మైక్ సపోర్ట్ మరియు బాస్ కోసం పెద్ద ఎయిర్ డక్ట్ ఉన్నట్లు కూడా అర్ధం అవుతుంది. ఈ బడ్స్ ప్రైస్ మరియు లాంచ్ ఆఫర్లతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో రేపు కలుద్దాం.