Honor 200 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తోంది హానర్. ఈ స్మార్ట్ ఫోన్ ముందుగా గ్లోబల్ మార్కెట్ లో విడుదల అయ్యింది. ఈ ఫోన్ ట్రిపుల్ 50MP స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరాలతో వస్తోంది. ఈ ఫోన్ ను చూడచక్కని డిజైన్, సూపర్ కెమెరా సెటప్ మరియు AI పవర్ ఫీచర్లతో లాంచ్ చేయబోతున్నట్లు హానర్ ఆటపట్టిస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Honor 200 5G లాంచ్ మరియు టీజ్ ఫీచర్లు
హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ జూలై 18వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ ఫోన్ ను సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. అంటే, ఈ ఫోన్ పైన గొప్ప అమెజాన్ సేల్ ఆఫర్ లను అందించే అవకాశం వుంది.
ఇక ఈ ఫోన్ టీజ్ స్పెక్స్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ గొప్ప డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ 50 MP స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో Netflix HDR మరియు Amazon HDR సర్టిఫికేషన్ కలిగిన 6.7 ఇంచ్ డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది.
Honor 200 5G
ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX906 మెయిన్ + 50MP Sony IMX856 టెలీ ఫోటో కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కెమెరాతో DSLR వంటి అద్భుతమైన పోర్ట్రైట్ లను షూట్ చేసే అవకాశం ఉందని హానర్ తెలిపింది. గొప్ప ఫోటోలు మరియు వీడియోలను అందించడానికి ఈ ఫోన్ లో హానర్ AI పోర్ట్రైట్ ఇంజిన్ ను కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో మరిన్ని AI కెమెరా ఫీచర్లు ఉన్నట్లు కూడా హానర్ తెలిపింది.