ఈ రోజు స్మార్ట్ వాచ్ మార్కెట్ కొత్త స్మార్ట్ వాచ్ విడుదలయ్యింది. మేడ్ ఇన్ ఇండియా కంజ్యూమర్ టెక్ బ్రాండ్ ACwO ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి సొంత బ్రాండ్ ACwO నుండి ఈ ACwO FwIT Play స్మార్ట్ వాచ్ వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ ను పెద్ద Luxury AMOLED డిస్ప్లే మరియు SOS వంటి మరిన్ని ఫీచర్ లతో మహిళల కోసం ప్రత్యేకంగా ఈ స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను మహిళలకు అవసరమైన అన్ని ఫీచర్లతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.
ఈ ACwO FwIT Play స్మార్ట్ వాచ్ ఆడవారి కోసం ప్రత్యేకంగా అందించబడింది. అందుకే ఆడవారికి అవసరమైన మరియు ఉపయోగకరమైన ఫీచర్లను ఈ స్మార్ట్ వాచ్ లో అందించింది. అత్యవసర సమయంలో అవసరమైన SOS ఫీచర్ తో ఈ స్మార్ట్ వాచ్ ని అందించింది. ఒక్క టచ్ తో ఎమర్జెన్సీ కాల్ మొదలుకొని పెద్దగా సైరన్ మోగించడం వంటి పనులు ఇది చేస్తుంది.
ACwO FwIT Play Smart Watch
24/7 హార్ట్ రేట్ మోనిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటరింగ్ మరియు ఫిమేల్ హెల్త్ సైకిల్ వరకు అన్ని పనులు ఇది నిర్వహిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 100+ స్పోర్ట్స్ మోడ్స్ మరియు వాచ్ ఫేస్ లతో వస్తుంది.
ఈ స్మార్ట్ వాచ్ ను ఆడవారికి తగిన డిజైన్ తో పాటుగా నోటిఫికేషన్ ఫీచర్స్ తో కూడా తీసుకు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. స్మార్ట్ వాచ్ పెద్ద 1.75 ఇంచ్ ఆల్వేస్ ఆన్ Luxury AMOLED డిస్ప్లే తో వస్తుంది.
ACwO FwIT Play : Price
ACwO సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ Rs. 3,499 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను acwo.com, ONDC, Tata CLiQ, Snapdeal మరియు ఇతర ప్రముఖ e-commerce ప్లాట్ ఫామ్స్ పైన ఈరోజు నుండి సేల్ కోసం అందుబాటులోకి తీసుకు వచ్చింది.