vivo T2x 5G: రెండు కొత్త కలర్ వేరియంట్స్ లో వివో బడ్జెట్ 5G ఫోన్.!

HIGHLIGHTS

వివో టి2ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరో రెండు కొత్త కలర్ ఆప్షన్ లలో లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్స్ తో వచ్చింది

vivo T2x 5G ఇప్పుడు తగ్గింపు ధరతో లభిస్తోంది

vivo T2x 5G: రెండు కొత్త కలర్ వేరియంట్స్ లో వివో బడ్జెట్ 5G ఫోన్.!

vivo T2x 5G: వివో ఇండియన మార్కెట్ లో విడుదల చేసిన వివో టి2ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరో రెండు కొత్త కలర్ ఆప్షన్ లలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్స్ తో వచ్చింది మరియు ఇప్పుడు తగ్గింపు ధరతో లభిస్తోంది. ఈ వివో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లో డిస్ప్లే మొదలుకొని కెమేరా వరకూ ఈ ధర పరిధిలో మంచి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

vivo T2x 5G New Variants Price

వివో టి2ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సన్ స్టోన్ ఆరంజ్ మరియు బ్లాక్ గ్లాడియేటర్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్ లలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని కలర్ ఆప్షన్ లు కూడా ఒకే ధరకు లభిస్తున్నాయి. అంటే, కలర్ ను బట్టి రేటులో ఎటుబంతి మార్పు లేదని క్లియర్ గా చెబుతున్నాము. ఈ ఫోన్ 4 GB RAM వేరియంట్ రూ. 11,999 ధరతో, 6 GB RAM వేరియంట్ రూ. 12,999 మరియు 8 GB RAM వేరియంట్ రూ. 14,999 ధరతో లిస్ట్ చేయబడ్డాయి.

Also Read: Infinix HOT 40i: 10 వేల ధరలో 16GB RAM మరియు 256GB స్టోరేజ్ తో లాంఛ్.!

వివో టి2ఎక్స్ 5జి స్పెక్స్

వివో టి2ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ లో Mediatek Dimensity 6020 ఆక్టా కొర్ ప్రోసెసర్ వుంది మరియు మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ వివో ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

ఈ వివో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ Full HD+ LCD డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ చాలా స్లిమ్ గా చక్కగా కనిపించే డిజైన్ ను కూడా కలిగి వుంది. Android 13 OS తో Funtouch OS 13 సాఫ్ట్ వేర్ తో ఈ ఫోన్ పని నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo