4G Calling Smart Watch ను లాంచ్ చేస్తున్న Noise కంపెనీ..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
Noise 4G Calling Smart Watch ను లాంచ్ చేస్తోంది
డిసెంబర్ 23 న మార్కెట్ లో విడుదల చేస్తునట్లు నోయిస్ తెలిపింది
ఈ ఫోన్ లాంచ్ కంటే ముందుగానే ధర మరియు ఫీచర్లను వెల్లడించింది
ఇండియాలో స్మార్ట్ వాచ్ వినియోగం నానాటికి పెరిగిపోతోంది. అందుకే, యూజర్ల మనసు దోచుకునేందుకు అన్ని స్మార్ట్ వాచ్ కంపెనీలు కూడా ఆకర్షణీయమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్ అలను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు నోయిస్ కూడా ఇదే దారిలో యూజర్ల మనసు దోచుకునే విధంగా మంచి ఫీచర్లతో 4G Calling Smart Watch ను లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ను డిసెంబర్ 23 న మార్కెట్ లో విడుదల చేస్తునట్లు నోయిస్ తెలిపింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందుగానే ధర మరియు ఫీచర్లను వెల్లడించింది.
Survey4G Calling Smart Watch

4జి కాలింగ్ ఫీచర్ తో కొత్త స్మార్ట్ వాచ్ NoiseFit Voyage ను లాంచ్ చేస్తున్నట్లు నోయిస్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ Airtel & Jio eSIM లకు సపోర్ట్ చేస్తుందని తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ ఎటువంటి స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా పని చేస్తుంది మరియు 200 వరకూ ఫోన్ నంబర్ లను సేవ్ చేసే అవకాశం కూడా వుంది. ఈ ఫోన్ ను రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Also Read : Xiaomi HyperOS ముందుగా అందుకోనున్న ఫోన్ల లిస్ట్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
NoiseFit Voyage ఫీచర్లు
నోయిస్ ఫిట్ వాయేజ్ 4జి కాలింగ్ స్మార్ట్ వాచ్ 1.4 ఇంచ్ రెటీనా AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 454×454 రిజల్యూషన్ కలిగి స్టెయిన్ లెస్ స్టీల్ డయల్ తో బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. సవివరమైన హెల్త్ డిటైల్స్ కోసం అధునాతన సెన్సార్ లను ఈ వాచ్ లో అందించి నట్లు నోయిస్ తెలిపింది. ఇందులో, హార్ట్ రేట్, స్ట్రెస్, SpO2 మరియు స్లీప్ మోనిటర్ ఫీచర్స్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ వాచ్ 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో పాటు సెలెక్టెడ్ స్పోర్ట్స్ కోసం ఆటో స్పోర్ట్స్ డిటెక్షన్ ఫీచర్ ను కూడా కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ TWS బడ్స్ ను డైరెక్ట్ గా కనెక్ట్ చెయ్యగలిగే ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ వాచ్ 7 డేస్ వరకూ బ్యాకప్ అందించ గల బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, కాలింగ్ యాక్టివ్ గా ఉన్నపుడు 2 రోజుల బ్యాకప్ మాత్రమే వస్తుందని కంపెనీ తెలిపింది.