Jio: Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసిన జియో | New Plans

HIGHLIGHTS

క్రికెట్ ప్రియుల కోసం Reliance Jio గొప్ప శుభవార్తను తీసుకు వచ్చింది

Disney+ HotStar యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్స్ లాంచ్

జియో ఈరోజు కొత్తగా 6 ప్రీపెయిడ్ ప్లాన్ లను Disney+ Hotstar తో లాంచ్ చేసింది

Jio: Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసిన జియో | New Plans

క్రికెట్ ప్రియుల కోసం రిలయన్స్ జియో గొప్ప శుభవార్తను తీసుకు వచ్చింది. Disney+ HotStar యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ తో Reliance Jio కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఈరోజు తన పోర్ట్ ఫోలియోలో జత చేసింది. ఈ కొత్త ప్లాన్ లను ఈరోజు నుండి మీరు myjio App మరియు రిలయన్స్ జియో పోర్టల్ నుండి రీఛార్జ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో తీసుకు వచ్చిన ఈ కొత్త క్రికెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను మరియు అవి అందించే ప్రయోజనాలను గురించి తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio – Disney+ Hotstar Plans

జియో ఈరోజు కొత్తగా 6 ప్రీపెయిడ్ ప్లాన్ లను Disney+ Hotstar ఉచిత సబ్ స్క్రిప్షన్ తో లాంచ్ చేసింది అవి: Rs 328, Rs 388, Rs 598, Rs 758, Rs 808 మరియు Rs 3178 ప్లాన్స్. ఈ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

Jio new Disney+ Hotstar plans
జియో-డిస్ని+ హాట్ స్టార్ ప్లాన్స్

Also Read: భారీగా పతనమైన Gold Rate..ఈరోజు మార్కెట్ లో రేటు ఎంతంటే| New Price

3నెలల డిస్ని+ హాట్ స్టార్ ప్లాన్స్

జియో Rs 328 ప్లాన్

జియో యొక్క ఈ కొత్త రూ. 328 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో మరియు 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ డైలీ 1.5GB డేటా మరియు 100 SMS/day ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో 3 నెలల (90 రోజులు) డిస్ని+ హాట్ స్టార్ మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

జియో Rs 388 ప్లాన్

ఈ జియో కొత్త రూ. 388 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ డైలీ 2GB డేటా మరియు 100 SMS/day ప్రయోజనాలను అఫర్ చేస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ తో 3 నెలల (90 రోజులు) డిస్ని+ హాట్ స్టార్ మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

జియో Rs 758 & Rs 808 ప్లాన్స్

ఈ రెండు కొత్త ప్లాన్స్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS, 3 నెలల (90 రోజులు) డిస్ని+ హాట్ స్టార్ మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను అందిస్తాయి. ఈ రెండు ప్లాన్స్ యొక్క డైలీ డేటా లిమిట్ లావు మార్పులు ఉంటాయి. వీటిలో, రూ.758 ప్లాన్ డైలీ 1.5 GB డేటా అందిస్తే, రూ.808 ప్లాన్ డైలీ 2 GB డేటా అందిస్తుంది.

1 సంవత్సరం డిస్ని+ హాట్ స్టార్ ప్లాన్స్

జియో Rs 598 ప్లాన్

ఈ జియో రూ. 598 ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో 1 సంవత్సరం డిస్ని+ హాట్ స్టార్ మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను మీకు అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ డైలీ 2GB డేటా మరియు 100 SMS/day ప్రయోజనాలను అఫర్ చేస్తుంది. 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న వారికి Unlimited 5G డేటా సౌలభ్యం కూడా లభిస్తుంది.

జియో Rs 3,178 ప్లాన్

ఈ జియో ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2 GB డేటా, డైలీ 100 SMS, వంటి లాభాలను అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 1 సంవత్సరం డిస్ని+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా మీకు ఉచితంగా లభిస్తుంది.

పైన తెలిపిన అన్ని ప్లాన్స్ పైన కూడా 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న వారికి Unlimited 5G డేటా సౌలభ్యం కూడా లభిస్తుంది. Check Jio Plans here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo