New buds launch: హెవీ బాస్ మరియు 360° సరౌండ్ సౌండ్ తో బడ్జెట్ బడ్స్ తెచ్చిన Realme

HIGHLIGHTS

Realme ఈరోజు New buds launch చేసింది

ఈ కొత్త బడ్స్ ను Realme Buds T300 పేరుతో మార్కెట్ లో పరిచయం చేసింది

360° Spatial Audio Effect తో సినీమ్యాటిక్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ పొందండి

New buds launch: హెవీ బాస్ మరియు 360° సరౌండ్ సౌండ్ తో బడ్జెట్ బడ్స్ తెచ్చిన Realme

Realme ఈరోజు New buds launch చేసింది మరియు ఈ కొత్త బడ్స్ ను Realme Buds T300 పేరుతో మార్కెట్ లో పరిచయం చేసింది. ఇటీవల ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం ఇయర్ బడ్స్ ను లంచ్ చేసిన రియల్ మి, ఇప్పుడు బడ్జెట్ ధరలో హెవీ బాస్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ తో ఈ కొత్త ఇయర్ బడ్స్ ను తీసుకు వచ్చింది. ఈరోజే ఇండియన్ మార్కెట్ లో విడుదలైన realme Buds T300 పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Buds T300 Features 

రియల్ మి బడ్స్ టి300 కొత్త ఇయర్ బడ్స్ ను కంపెనీ 12.4mm డైనమిల్ BASS స్పీకర్లతో అందించింది. ఈ బడ్స్ బయటి శబ్దాలు వినపడకుండా చేసే 30db యాక్టీవ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ లో క్రిస్టల్ క్లియర్ మరియు హై ఎండ్ సౌండ్ ను ఆస్వాదించ వచ్చని రియల్ మి తెలిపింది. 

Realme Buds T300 లో అందించిన 360° Spatial Audio Effect తో సినీమ్యాటిక్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ కూడా పొందగలరని రియల్ మి చెబుతోంది. క్రిస్టల్ క్లియర్ కాల్స్ అందించడానికి వీలుగా 4mic కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా ఈ బడ్స్ లో వుంది. ఈ బడ్స్ మొత్తంగా 40 గంటల ప్లే బ్యాక్ ను ఇవ్వగల బ్యాటరీని వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా కలిగి వుంది.

ఈ రియల్ మి బడ్స్ కేవలం 10 నిముషాల క్విక్ చార్జ్ తో 7 గంటల ప్లే బ్యాక్ ను ఇవ్వగదని కూడా రియల్ మి గొప్పగా చెబుతోంది. ఈ బడ్స్ 50ms అల్ట్రా లో లెటెన్సీ తో మరియు బ్లూటూత్ 5.3 తో వస్తుంది.డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ రియల్ మి ఇయర్ బడ్స్ IP55 రేటింగ్ తో         

Realme Buds T300 Price 

రియల్ మి బడ్స్ టి300 కొత్త ఇయర్ బడ్స్ ను రియల్ మి రూ.2,299 రూపాయల ధరలో లాంచ్ చేసింది. ఈ రియల్ మి కొత్త బడ్స్ స్టైలిష్ బ్లాక్ మరియు యూత్ వైట్ రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఫస్ట్ సేల్ అఫర్ క్రింద రూ. 100  రూపాయల తగ్గింపు అఫర్ ను కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo