Fastrack: పెద్ద డిస్ప్లే, ATS చిప్సెట్ తో బడ్జెట్ స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన ఫాస్ట్ ట్రాక్.!

HIGHLIGHTS

Fastrack ఇండియాలో కొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది

పెద్ద డిస్ప్లే మరియు వేగవంతమైన ATS చిప్ సెట్ తో లాంచ్

ఈ స్మార్ట్ వాచ్ ఫాస్ట్ ట్రాక్ ఆన్లైన్ స్టోర్ మరియు అమెజాన్ నుండి లభిస్తోంది

Fastrack: పెద్ద డిస్ప్లే, ATS చిప్సెట్ తో బడ్జెట్ స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన ఫాస్ట్ ట్రాక్.!

ప్రముఖ ఫ్యాషన్ యాక్ససరీస్ రిటైల్ బ్రాండ్ Fastrack ఇండియాలో కొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను పెద్ద డిస్ప్లే మరియు వేగవంతమైన ATS చిప్ సెట్ తో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ ఫాస్ట్ ట్రాక్ ఆన్లైన్ స్టోర్ మరియు అమెజాన్ నుండి లభిస్తోంది. మరి ఫాస్ట్ ట్రాక్ సరికొత్తగా తీసుకొచ్చిన ఈ కొత్త స్మార్ట్ వాచ్ Fastrack Limitless FS1 ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 Fastrack Limitless FS1: ధర 

ఫాస్ట్ ట్రాక్ యొక్క ఈ కొత్త స్మార్ట్ వాచ్ రూ.1,995 రూపాయల ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ను మీరు అమెజాన్ మరియు fastrack ఆన్లైన్ స్టోర్ నుండి అందుబాటులో వుంది. Buy From Here

 Fastrack Limitless FS1: ప్రత్యేకతలు 

ఫాస్ట్ ట్రాక్ లిమిట్ లెస్ FS1 స్మార్ట్ వాచ్ పెద్ద 1.95 ఇంచ్ హారిజాన్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 240 x 296 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగివుంది. ఈ స్మార్ట్ వాచ్ వేగవతంగా పనిచేయడానికి వీలుగా ఇందులో నెక్స్ట్ జెనరేషన్ ATS చిప్ సెట్ ను అందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ బిల్ట్ ఇన్ Alexa తో వస్తుంది మరియయు 150 కి పైగా వాచ్ పేస్ లను కలిగి వుంది. 

ఇక ఈ స్మార్ట్ వాచ్ చేయగలిగిన ఇతర పనుల విషయానికి వస్తే, ఇది 100 కి పైగా స్పోర్ట్ మోడ్స్ ను కలిగివుంది. అలాగే, లేటెస్ట్ BT  వెర్షన్ 5.3, డయల్ ప్యాడ్ కాలింగ్, మ్యూజిక్ ప్లేయర్ లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo