Smart Watch: తక్కువ ధరలో బిగ్ స్క్రీన్ స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన ఆంబ్రేన్.!

HIGHLIGHTS

ఆంబ్రేన్ సరికొత్త స్మార్ట్ వాచ్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది

'Wise Eon Max' పేరుతో ఆంబ్రేన్ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్ బిగ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది

ఈ స్మార్ట్ వాచ్ ను 2.01 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో అందించడం విశేషం

Smart Watch: తక్కువ ధరలో బిగ్ స్క్రీన్ స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన ఆంబ్రేన్.!

భారతీయ లైఫ్ స్టైల్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఆంబ్రేన్ సరికొత్త స్మార్ట్ వాచ్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. 'Wise Eon Max' పేరుతో ఆంబ్రేన్ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్ బిగ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకూ అన్ని బ్రాండ్స్ కూడా వారి స్మార్ట్ వాచ్ లను 1.9 ఇంచ్ లోపలే అఫర్ చేస్తుండగా, ఆంబ్రేన్ మాత్రం తన తాజా స్మార్ట్ వాచ్, వైజ్ ఇయాన్ మాక్స్ స్మార్ట్ వాచ్ ను 2.01 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో అందించడం విశేషం. ఆంబ్రేన్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ వాచ్ ఎలా ఉన్నదో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Ambrane Wise Eon Max: 

ఆంబ్రేన్ ఈ 'Wise Eon Max' స్మార్ట్ వాచ్ ను రూ.1,799 రూపాయల లాంచ్ అఫర్ ధరతో విడుదల చేసింది. అయితే, ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ.5,999 రూపాయలుగా కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు నుండి Flipkart అఫర్ ధరకే లభిస్తోంది.

ఇక ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే, వైజ్ ఇయాన్ మాక్స్ 550 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన 2.01 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో వస్తుంది. కాలింగ్ మరియు నోటిఫికేషన్స్ చదవడానికి ఈ స్క్రీన్ చక్కగా సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.  రన్నింగ్, వాకింగ్ సైక్లింగ్ వంటి 100 కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ స్ వాచ్ లో ఉన్నాయి.  ఈ స్మార్ట్ వాచ్ 280mAh బ్యాటరీతో 10 రోజుల బ్యాకప్ అందిస్తుందని కూడా ఆంబ్రేన్ తెలిపింది. 

ఈ వాచ్ Bluetooth v5.0 కనెక్టివిటీతో బ్లూటూత్ కాలింగ్ మరియు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది. హార్ట్ రేట్ మోనిటరింగ్, SpO2, స్లీప్ ట్రాకింగ్ మరియు పీరియడ్స్ సైకిల్ ట్రాకింగ్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ IP68 వాటర్ రెసిస్టెంట్ తో పాటుగా దృడంగా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo