Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి 70,000 నిరుద్యోగులకు ఉపాధి అవకాశం

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి 70,000 నిరుద్యోగులకు ఉపాధి అవకాశం
HIGHLIGHTS

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో 70,000 మందికి ఉపాధి.

ఈ నెల ప్రారంభంలో, ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ హోల్‌ సేల్ ‌ను ప్రారంభించింది, ఇది

ఉద్యోగాలను మార్కెట్ చేయడానికి ఇది సహాయపడుతుందని వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ మంగళవారం తెలిపింది.

పండుగ సీజన్ మరియు బిగ్ బిలియన్ డేస్ (BBD) అమ్మకాలకు ముందు దేశంలో 70,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష మరియు లక్షల పరోక్ష సీజనల్ ఉద్యోగాలను మార్కెట్ చేయడానికి ఇది సహాయపడుతుందని వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ మంగళవారం తెలిపింది. అంటే, ఈ ప్రకటన ద్వారా రాబోయే సేల్ లో 70,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ సప్లయింగ్ చైన్ ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుండగా, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ , పికర్స్, ప్యాకర్స్ మరియు సార్టర్స్ వంటి మరిన్ని ఉద్యోగ అవకాశాలు  కూడా ఉంటాయని, ఫ్లిప్‌కార్ట్ విక్రేత భాగస్వాములు లొకేషన్ మరియు స్టోర్లలో అదనపు పరోక్ష ఉద్యోగాలను అందించే అవకాశం వుంటుందని బెంగళూరుకు చెందిన సంస్థ తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో, ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ హోల్‌ సేల్ ‌ను ప్రారంభించింది, ఇది అమ్మ-పాప్ దుకాణాలు మరియు ఇతర చిన్న వ్యాపారాల కోసం ఆన్ ‌లైన్ హోల్‌ సేల్ సర్వీస్. అమెజాన్, రిలయన్స్ వంటి దిగ్గజాలు ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్లైన్ అమ్మకాలలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడనికి చూస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్ డే తరహాలో ప్రారంభమైన ఫ్లిప్‌ కార్ట్ యొక్క "బిగ్ బిలియన్ డేస్", సంవత్సరంలో అతిపెద్ద సేల్ గా అవతరించింది. నాలుగు లేదా ఐదు రోజుల సుదీర్ఘ సేల్ సాధారణంగా అక్టోబర్ నెలలో మొదలవుతుంది, ఇది భారతదేశ పండుగ సీజన్ లో భాగంగా కొనసాగుతుంది మరియు ఇది దీపావళితో ముగుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

 
Digit.in
Logo
Digit.in
Logo