Poco జూలై నెలలో M2 లో భాగంగా ముందుగా Pro వేరియంట్ ను ప్రకటించగా, రేపు మధ్యాహ్నం సాధారణ వేరియంట్ Poco M2 ను విడుదల చెయ్యబోతోంది. Poco M2 స్మార్ట్ ఫోన్, చాలా తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే సొంతమైన 33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు SD720G వంటి గేమింగ్ ప్రాసెసర్ వంటి ఫీచర్లను కేవలం బడ్జెట్ ధరలో కూడా అందుకోవచ్చని నిరూపించింది.
Survey
✅ Thank you for completing the survey!
ఇప్పుడు రేపు ఇండియాలో విడుదలకానున్న POCO M2 స్మార్ట్ ఫోన్ చాలా భారీ ఫీచర్లను తీసుకోస్తుందని పోకో సంస్థ ఇప్పటికే టీజ్ చేస్తోంది. flipkart కూడా ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ని అందించింది. దీనిలో టీజ్ చేస్తున్న వివరాల ప్రకారం, Poco M2 స్మార్ట్ పెద్ద 5,000 బ్యాటరీ, FHD+ డిస్ప్లే మరియు వెనుక క్వాడ్ కెమెరాలను కలిగి ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక ముందుగా వచ్చిన Poco M2 గురించి ఈ క్రింద చూడవచ్చు.
ఈ Poco M2 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 పొరతో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్ ఉంది మరియు 209 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 8.8 మిమీ మందంతో వస్తుంది.
ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జి ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 పై పోకో లాంచర్‌తో నడుస్తుంది. ఈఫోనే మరింత స్టోరేజి విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డును కలిగి ఉంది.
పోకో M2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని f / 1.8 ఎపర్చరుతో, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ తో , 5MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ కలుపుకుంది. వెనుక కెమెరాలు 4K UHD రీకార్డింగ్ ని 30FPS వద్ద మరియు స్లో-మోషన్ వీడియోలను HD లో 960FPS వరకు షూట్ చేయగలవు. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.