Facebook news ని రాబోయే కొన్ని నెలల్లోనే భారతదేశంలో ప్రవేశపెట్టనున్నట్లు facebook తెలిపింది. ముందుగా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ మరియు UK లలో ప్రారంభించవచ్చని Facebook మంగళవారం ప్రకటించింది. ఫేస్ బుక్, ఈ ఫీచర్‌ను గత ఏడాది US లో మాత్రమే ప్రవేశపెట్టింది. ఈ Facebook news Service ను వచ్చే ఏడాది నాటికి అనేక దేశాలలో ప్రారంభించవచ్చని అంచనా వేస్తున్నారు.
Survey
✅ Thank you for completing the survey!
ఈ సోషల్ మీడియా దిగ్గజం కొత్త ప్రోడక్ట్ పైన కంటెంట్‌ను అందుబాటులో ఉంచడానికి వార్తా ప్రచురణకర్తలకు చెల్లింపును కూడా చేస్తుందని కూడా చెప్పారు. అయితే, ఆస్ట్రేలియాలో మాత్రం ఫేస్ బుక్ ఈ సర్వీస్ ను అందించబోదని ఒక నివేదిక సూచించింది.
అమెరికాలో ఫేస్ బుక్ న్యూస్ ప్రారంభించినప్పటి నుండి కనిపించిన పురోగతి తరువాత, రాబోయే ఆరు నుండి పన్నెండు నెలల్లో పైన పేర్కొన్న దేశాలలో ఈ సేవను అందుబాటులోకి తీసుకురావాలని మేము ప్లాన్ చేశామని ఫేస్ బుక్ తన ప్రకటనలో పేర్కొంది. ఫేస్ బుక్ గ్లోబల్ న్యూస్ పార్ట్నర్షిప్ వైస్ ప్రెసిడెంట్ క్యాంప్ బెల్ బ్రౌన్ మాట్లాడుతూ, ప్రతి దేశంలోని వార్తా ప్రచురణకర్తలకు ఈ సంస్థ చెల్లించాల్సి ఉంటుందని, పేర్కొన్నారు.
Facebook యొక్క New Service యుఎస్ ప్రచురణకర్తలకు కంటెంట్ కోసం చెల్లిస్తుంది మరియు 200 అవుట్లెట్ల నుండి వేలాది లోకల్ వార్తా సంస్థల నుండి నిజమైన రిపోర్టింగ్ ను కలిగి ఉంటుంది. US లో ఫేస్ బుక్ వార్తలపై ఎంగేజ్ మెంట్ పెంచడానికి ఫేస్ బుక్ నిరంతరం పని చేస్తుంది. అమెరికన్ పబ్లిషర్స్ తో ఈ భాగస్వామ్యాన్ని దీర్ఘకాలిక ఆస్తిగా మార్చడానికి కంపెనీ కృషిచేస్తోంది.