Nokia 5.3 స్మార్ట్ ఫోన్ తో పాటుగా HMD గ్లోబల్ ఇండియాలో 4 కొత్త నోకియా ఫోన్‌లను ప్రకటించింది. ఇందులో రెండు 2 జి ఫీచర్ ఫోన్లు మరియు రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో, నోకియా భారతదేశంలో ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ పై దృష్టి పెట్టింది. అంతేకాదు, ఇక్కడ మార్కెట్ వాటా యొక్క ప్రధాన భాగాన్నిశాసిస్తోంది. కానీ, ఇప్పటి వరకు ఇదే ప్రాముఖ్యతను స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించడం విస్మరించింది. అయితే, ఈరోజు ప్రవేశపెట్టిన Nokia 5.3 మరియు Nokia C3 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో, బడ్జెట్ సెగ్మెంట్ లో పోటీని పెంచనుంది. ఈ Nokia 5.3 స్మార్ట్ ఫోన్ను కేవలం రూ .13,999 ధరతో విడుదల చేసింది.
Survey
✅ Thank you for completing the survey!
Nokia 5.3: డిస్ప్లే
ఈ Nokia 5.3 ఒక 6.55-అంగుళాల HD + (1600 x 700 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో 20: 9 యాస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. సాధారణ ప్రమాదాల నుండి అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 పొరతో ఈ స్క్రీన్ సేఫ్టీ చెయ్యబడింది. ఇది 8.5 మిల్లీ మీటర్ల మందం మరియు 185 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.
నోకియా 5.3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు అడ్రినో 610 GPU తో పనిచేస్తుంది. ఇది 3GB / 4GB / 6GB RAM మరియు 64GB స్టోరేజ్ తో జతచేయబడి మైక్రో SD కార్డ్ ను ఉపయోగించి మరింత విస్తరించే ఎంపికతో ఉంటుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 10 తో పని చేస్తుంది.
Nokia 5.3: కెమేరా&బ్యాటరీ
ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 13 MP ప్రాధమిక కెమెరా, 5 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వెనుక కెమెరాలు 30KPS వద్ద 4K UHD వరకు రికార్డ్ చేయగలవు. ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4,000mAh బ్యాటరీతో తీసుకొచ్చింది.