Moto G 9 స్మార్ట్ ఫోన్ ఈ రోజు భారతదేశంలో లాంచ్ కానుంది. ఫ్లిప్ కార్ట్ మరియు మోటరోలా కొంతకాలంగా “Something Big” లాంచ్ గురించి టీజ్ చేస్తున్నాయి. అయితే, ఏ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నారో మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే, Moto G 9 ను సోమవారం (ఆగస్టు 24)న లాంచ్ చేయనున్నట్లు లెనోవా యాజమాన్యంలోని సంస్థ URL లింక్లో తెలిపింది.
Survey
✅ Thank you for completing the survey!
అయితే, మోటరోలా తన మోటో జి 9 లేదా మోటో జి 9 సిరీస్ ను లాంచ్ చేస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. వాస్తవానికి, మోటో జి 9 ప్లస్ మరియు మోటో జి 9 ప్లే ఫోన్స్ లాంచ్ కోసం సోషల్ మీడియాలో చాలా డిమాండ్ ఉంది.
ఆగస్టు 24 న మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త ఫోన్ ను విడుదల చేయనున్నట్లు మోటరోలా టీజ్ చేసింది. ఏదేమైనా, సంస్థ దాని కోసం ఎటువంటి వర్చువల్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు, ఈ ఫోన్ లాంచ్ నేరుగా ప్రకటించబడుతుంది.
Moto G 9: అంచనా ఫీచర్స్
ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజి ప్రకారం, మోటో జి 9 గొప్ప పనితీరు, గొప్ప కెమెరా మరియు శక్తివంతమైన బ్యాటరీతో అందించబడుతుంది. ఏదేమైనా, సంస్థ యొక్క ఈ టీజింగ్ పోస్టర్ వివరాలు, ఫోన్ లాంచ్ స్పెసిఫికేషన్ల వివరాలు తెలిసే వరకు పూర్తిగా అర్ధం కావు. అయితే, శక్తివంతమైన బ్యాటరీ అంటే, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుందని ఉహించవచ్చు.