Nokia 32 inch Smart LED టీవీని బడ్జెట్ ధరలో ప్రకటించే అవకాశం : రిపోర్ట్

Nokia 32 inch Smart LED టీవీని బడ్జెట్ ధరలో ప్రకటించే అవకాశం : రిపోర్ట్
HIGHLIGHTS

Nokia భారతదేశంలో 2 కొత్త టీవీలను లాంచ్ చెయ్యడానికి చూస్తున్నట్లు, ఆన్లైన్ లో అనేక రూమర్లు మరియు వార్తలు వస్తున్నాయి.

నోకియా 32 ఇంచ్ టీవీని Nokia 32 Inch Smart LED TV గా బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా బడ్జెట్ సెగ్మెంట్ ధరలో తీసుకురావచ్చని ప్రస్తుత నివేదికలు చెబుతున్నాయి.

ఈ క్రొత్త 50-అంగుళాల మరియు 32-అంగుళాల టీవీలు ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్ ‌ఫామ్ ‌లో పనిచేయవచ్చు.

Nokia భారతదేశంలో 2 కొత్త టీవీలను లాంచ్ చెయ్యడానికి చూస్తున్నట్లు, ఆన్లైన్ లో అనేక రూమర్లు మరియు వార్తలు వస్తున్నాయి. BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ధృవీకరణ ప్రకారం, నోకియా భారతదేశంలో 50-అంగుళాల మరియు 32-అంగుళాల పరిమాణంలో టీవీలను ప్రారంభించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటిలో నోకియా 32 ఇంచ్ టీవీని Nokia 32 Inch Smart LED TV గా బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా బడ్జెట్ సెగ్మెంట్ ధరలో తీసుకురావచ్చని ప్రస్తుత నివేదికలు చెబుతున్నాయి.  

ఈ లిస్టింగ్ ప్రకారం, 50-అంగుళాల టీవీ మరియు 32-అంగుళాల టీవీలు  50TAUHDN మరియు 32TAHDN మోడల్ నంబర్ తో కనిపించాయి. 50-అంగుళాల టీవీ యొక్క మోడల్ నంబర్‌లోని UHD నోకియా యొక్క పోర్ట్‌ఫోలియోలోని ఇతర టీవీల మాదిరిగానే ఇది 4K టీవీ కావచ్చునని సూచిస్తుంది. అయినప్పటికీ, 32-అంగుళాల వేరియంట్ ఒక HD లేదా FHD TV కావచ్చు, ఎందుకంటే మోడల్ నంబర్ లో కేవలం “HD” ను మాత్రమే కలిగి ఉంది. విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, నోకియా 43-అంగుళాల టీవీకి మోడల్ నంబర్ 43CAUHDN ఉంది, 55-అంగుళాల వేరియంట్లో మోడల్ సంఖ్య 55CAUHDN మరియు 65-అంగుళాల వేరియంట్ 65CAUHDN మోడల్ సంఖ్యను కలిగి ఉంది.

నోకియా యొక్క పోర్ట్‌ఫోలియోలోని ఇతర టీవీల మాదిరిగానే, ఈ క్రొత్త 50-అంగుళాల మరియు 32-అంగుళాల టీవీలు ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్ ‌ఫామ్ ‌లో పనిచేయవచ్చు. ఇది అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్ వంటి ఫీచర్లతో పాటు అంతర్నిర్మిత స్ట్రీమింగ్ సర్వీస్ లకు ను కూడా తెస్తుంది. Google అసిస్టెంట్ మద్దతు మరియు ప్లే స్టోర్ కు యాక్సెస్ కూడా ఉంటుంది.

Nokia 32 Inch Smart LED TV: అంచనా ధర

ఇప్పటి వరకూ వచ్చిన నోకియా LED టీవీలు అన్ని కూడా ప్రీమియం సెగ్మెంట్ ధరలో ప్రకటించబడ్డాయి. కానీ, త్వరలో విడుదల చెబతున్నట్లు చెబుతున్న ఈ Nokia 32 Inch Smart LED TV  మాత్రం బడ్జెట్ విఐయోగదారులను ఆకట్టుకునే విధంగా రూ .10,000 నుంచి రూ .15 వేల ధరలో ప్రకటించవచ్చని అంచనావేస్తున్నారు. అంతేకాదు, Nokia 32 Inch Smart LED TV టీవీ ధర ఇదే విభాగంలో ఉండవచ్చని మేము కూడా భావిస్తున్నాము. అయితే, ఈ ధరలు కేవలం ఊహగానాలు మాత్రమే, ఎందుకంటే దీని గురించి నోకియా నుండి ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

Source:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo