ఇటీవల, కేవలం మిడ్ రేంజ్ ధరలో 5G సపోర్ట్ తో తీసుకొచ్చినటువంటి OnePlus Nord 5G స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు ప్రకటించిన అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మొదలయ్యింది. ఈ OnePlus Nord 5G స్మార్ట్ ఫోన్ తమ సొంతం చేసుకోవాలని చుస్తున్నవారు ఈరోజు అమేజాన్ నుండి కొనవచ్చు. ఈ ఫోన్, కెమేరా, పెరఫార్మెన్స్ , మరియు డిస్ప్లే పరంగా గొప్పగా వుంటుంది.
Oneplus NORD ఒక 6.44-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను 90Hz హై-రిఫ్రెష్-రేట్‌తో కలిగివుంది. సెల్ఫీ కెమెరా కోసం ఈ ఫోన్ పంచ్-హోల్ డిజైన్ డిస్ప్లే తో వస్తుంది మరియు ఇందులో మీకు డ్యూయల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది.
ఈ ఫోన్‌ను Qualcomm Snapdragon 765 G 5G ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు Adreno 620 GPU తో కలిగి ఉంటుంది. ఇది 8 జిబి/12 జిబి ర్యామ్ మరియు 128 జిబి/256 జిబి స్టోరేజ్ తో జత చేయబడింది.
Oneplus NORD వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ తో వుంటుంది, ఇందులో ప్రాధమిక 48 MP కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్-కెమెరా మరియు 5MP సెన్సార్ కి జతగా 2 MP మాక్రో లెన్స్ ఉంటాయి. ముందు వైపు సెల్ఫీలు కోసం 16 MP కెమెరా ఉంది.
ఇది అవుట్-ఆఫ్-ది-బాక్స్ వ్రాప్ ఛార్జ్ 30T ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,115 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.