Recurring Payments కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ రోజు UPI Auto Pay సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ తో, వినియోగదారులు మొబైల్ ప్రెమెంట్స్, విద్యుత్ బిల్లులు, EMI చెల్లింపులు, వినోదం మరియు OTT సభ్యత్వం, భీమా, మ్యూచువల్ ఫండ్స్ మరియు లోన్ పేమెంట్స్ వంటి రికరింగ్ ప్రెమెంట్స్ కోసం ఏదైనా UPI అప్లికేషన్ ద్వారా ఇ-మాండేట్ ఉపయోగించి 2000 రూపాయల వరకు చెల్లించవచ్చు. అయితే, మీరు చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ 2000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే, వినియోగదారులు UPI PIN ఉపయోగించి ప్రెమెంట్స్ చెయ్యవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Recurring Payments అంటే ఏమిటి ?
అంటే, సాధారణ పద్దతిలో అర్ధమయ్యేలా చెప్పాలంటే ప్రతినేలా లేదా ఖచ్చితంగా టైం ప్రకారం పేమెంట్ చెయ్యాల్సిన వాటికీ ఈ UPI Auto Pay ఉపయోగించి మీ బ్యాంక్ యొక్క UPI ద్వారా ఆటొమ్యాటిగా ప్రెమెంట్స్ చేసే విధానం అని సూటిగా చెప్పవచ్చు. దీన్ని మనం Automatic Bill Payment System అని కూడా అర్ధం చేసుకోవచ్చు.
UPI ద్వారా పనిచేసే అన్ని అప్లికేషన్స్ (APP) లో 'Mandate' విభాగం కూడా ఉంటుంది. దీని ద్వారా, వినియోగదారులు Auto Debit ఆదేశాన్నిక్రియేట్ చెయ్యవచ్చు మరియు ఆమోదించవచ్చు. అలాగే, మార్పులు చేయవచ్చు, అలాగే ఆపవచ్చు. మాండేట్ విభాగం వినియోగదారులు వారి సూచనలు మరియు రికార్డుల కోసం వారి మునుపటి ఆదేశాన్ని చూడటానికి అనుమతిస్తుంది. UPI యూజర్లు UPI ID , QR Scan లేదా నేరుగా ఇ-మాండేట్ క్రియేట్ చెయ్యవచ్చు. రికరింగ్ ప్రెమెంట్స్ పై వినియోగదారుల ఖర్చును దృష్టిలో ఉంచుకుని, ఆటో డెబిట్ ఆదేశం కోసం ఒక ప్యాట్రన్ తయారు చేయబడింది. ఈ ప్యాట్రన్ లో, ఒకసారి, డైలీ, వీక్లీ, 15 రోజులు, నెలవారీ, రెండు నెలలు , త్రైమాసిక, అర్ధ-వార్షిక మరియు పూర్తి సంవత్సరం కూడా సెట్ చేయవచ్చు.
UPI Auto Pay Live
వినియోగదారులు తమ ఖాతాను UPI PIN ద్వారా ఒకసారి పొదుపరచాలి. దాని తరువాత, నెలవారీ ప్రెమెంట్స్ ఆటొమ్యాటిగ్గా డెబిట్ అవుతుంది. ఇప్పటికే UPI Auto Pay తో live చేసిన కొన్ని బ్యాంకులు, వ్యాపారులు మరియు అగ్రిగేటర్లు ని పరిశీలిస్తే, Axis బ్యాంక్, Bank Of Baroda , HDFC బ్యాంక్, HSBC బ్యాంక్, ICICI బ్యాంక్, IDFC బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, Paytm Payments బ్యాంక్, Auto Pay- Delhi మెట్రో , Auto Pay- డిష్ టివి, కామ్స్ పే, ఫుర్లెంకో, గ్రోఫిటర్, పాలసీ బజార్, టెస్ట్బుక్.కామ్, ది హిందూ, టైమ్స్ ప్రైమ్, పేటిఎమ్, Pay U, రేజర్ పే, ఇంకా ఇతరులు. జియో పేమెంట్స్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు YES బ్యాంక్ త్వరలో Auto Pay తో Live కానున్నాయి.