POCO, ఇండియాలో కొత్తగా ప్రకటించిన తన Poco M2 Pro స్మార్ట్ ఫోన్‌ను చాలా సరసమైన విభాగానికి తీసుకువచ్చింది. ఈ Poco M2 Pro స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో చాలా ఎక్కువ ఫిచర్లను తీసుకొస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే, ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G ప్రాసెసర్ మరియు వెనుక భాగంలో క్వాడ్ కెమెరాలతో పాటుగా మరిన్ని గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క M2 Pro యొక్క సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్‌లో మొదలు అవుతుంది.
ఈ Poco M2 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 పొరతో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్ ఉంది మరియు 209 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 8.8 మిమీ మందంతో వస్తుంది.
ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జి ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 పై పోకో లాంచర్‌తో నడుస్తుంది. ఈఫోనే మరింత స్టోరేజి విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డును కలిగి ఉంది.
పోకో M2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని f / 1.8 ఎపర్చరుతో, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ తో , 5MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ కలుపుకుంది. వెనుక కెమెరాలు 4K UHD రీకార్డింగ్ ని 30FPS వద్ద మరియు స్లో-మోషన్ వీడియోలను HD లో 960FPS వరకు షూట్ చేయగలవు. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.