సోషల్ మీడియాలో చైనీస్ ఉత్పత్తులను నిషేధించే Post లను మనం అధికంగా చూస్తున్నాము మరియు చైనా పైన ప్రజల కోపాన్ని స్పష్టంగా చూడవచ్చు. చైనా కంపెనీలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా ఇదే పరిస్థితి. భారతదేశంలో తయారు చేసిన స్మార్ట్ ఫోన్లు లేదా భారతీయ కంపెనీలు తయారుచేసిన ఫోన్లను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రోజు మనం చైనా కంపెనీలు మినహా ఇతర దేశాల స్మార్ట్ ఫోన్ కంపెనీల గురించి చూదాం.
Survey
✅ Thank you for completing the survey!
Apple
ఆపిల్ ఒక ప్రసిద్ధ US సంస్థ మరియు iOS తో పనిచేసే Hi-End ఫ్లాగ్షిప్ iPhone లను తయారు చేస్తుంది, వీటిని ప్రజలు స్టేటస్ సింబల్ కూడా ఉపయోగిస్తారు.
శామ్సంగ్ ఒక దక్షిణ కొరియా సంస్థ, ఇది భారతదేశంలో బడ్జెట్ ఫోన్లు మొదలుకొని హై-ఎండ్ ఫ్లాగ్షిప్ ఫోన్ల వరకు ప్రతిదీ విక్రయిస్తుంది.
Google
ఆన్లైన్ Search దిగ్గజంగా మనకు తెలిసిన ఏకైక సంస్థ Google దిగ్గజం. అదే సమయంలో ఈ కంపెనీ అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను తయారు చేసి భారతదేశంలో కూడా విక్రయిస్తుంది. ఈ సంస్థ అందించే ఫోన్లు కెమెరాకి ఐకానిక్ సింబల్ అని చెప్పొచ్చు.
Sony
సోనీ ఒక జపనీస్ సంస్థ మరియు భారతదేశంలో చాలా మంచి ఫోన్లను విడుదల చేసింది. అంతేకాదు, ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నమ్మదగిన బ్రాండ్ గా పేరుతెచ్చుకుంది.
HTC
HTC ఒక తైవానీస్ సంస్థ మరియు దాని స్మార్ట్ ఫోన్లు భారతదేశంలో కూడా ప్రారంభించబడ్డాయి.
Asus
అసూస్ ఒక తైవానీస్ సంస్థ, ఇది గొప్ప బడ్జెట్ స్మార్ట్ ఫోన్లతో పాటు సూపర్ గేమింగ్ ఫోన్లను కూడా తయారుచేస్తుంది.
Nokia
నోకియా అనేది HMD గ్లోబల్ చేత నిర్వహించబడుతున్న బ్రాండ్, ఈ ఫిన్నిష్ కంపెనీ ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
Foxconn
Foxconn అనేది ఆపిల్, నోకియా, షావోమి వంటి స్మార్ట్ఫోన్లను తయారుచేసే సంస్థ మరియు ఈ కంపెనీ తయారీ కర్మాగారాలు చైనా, ఇండియా, బ్రెజిల్ మరియు ఇతర దేశాలలో అందుబాటులో ఉన్నాయి.
మీరు భారతీయ స్మార్ట్ఫోన్ కంపెనీల గురించి తెలుసుకోవాలంటే, మీరు ఈ Link పైన నొక్కడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.